Ranbir-Aditya dhar: మిషన్ ‘మార్చ్’ ఫిక్స్.. రణవీర్ సింగ్ – ఆదిత్య ధర్ క్రేజీ కాంబోలో మరో మూవీ
సెన్సేషన్ కాంబో రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్(Ranbir-Aditya dhar) మరో భారీ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
- V Santhosh Kumar
- Published on- April 29, 2026 / 05:36 PM IST
Are Ranveer Singh and Aditya Dhar working on another film after the success of Dhurandhar?
- రణవీర్ – ఆదిత్య హ్యాట్రిక్ కాంబో.
- మార్చి 2027లో షూటింగ్ ప్రారంభం.
- రికార్డులు సృష్టించిన ధురంధర్ ఫ్రాంచైజీ.
Ranbir-Aditya dhar: ధురంధర్.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరో రణవీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. 2025లో విడుదలైన ‘ధురంధర్’ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించగా, ఈ ఏడాది విడుదలైన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ ఏకంగా రూ.1,780 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
Lenin: ‘లెనిన్’పై నాగార్జున రివ్యూ.. ఈసారి మిస్ అవ్వదట.. ఏకంగా ‘పెద్ది’కి పోటీగా దిగుతున్నారు!
ఈ నేపధ్యంలోనే, బాలీవుడ్ వర్గాల్లో ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే, ఈ సూపర్ హిట్ కాంబో(Ranbir-Aditya dhar) మరో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారట. ఈ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను ఆదిత్య ధర్ ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం. సరికొత్త కాన్సెప్ట్‌తో రానున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉందట. గత కొంతకాలంగా ఆదిత్య ధర్ తన డ్రీం ప్రాజెక్ట్ ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ను పట్టాలెక్కిస్తారా? లేక రణవీర్ సింగ్ సినిమాతో వేరే సినిమా చేస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ధురంధర్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తరువాత రణవీర్ సింగ్, ఆదిత్య ధర్ మరో సినిమా చేస్తున్నారు అనే న్యూస్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ అదే నిజమైతే అంచనాలు ఒక రేంజ్ లో ఉండటం ఖాయం. మరి, తన తరువాత సినిమాను దర్శకుడు ఆదిత్య ధర్ ఏ జానర్ లో తెరకెక్కిస్తాడు అనేది చూడాలి.
