Nagarjuna Lenin: ‘లెనిన్’పై నాగార్జున రివ్యూ.. ఈసారి మిస్ అవ్వదట.. ఏకంగా ‘పెద్ది’కి పోటీగా దిగుతున్నారు!
Nagarjuna Lenin Review: అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్(Akhil akkineni Lenin). ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
Nagarjuna Gives a Solid Review on Akhil Akkineni Lenin movie
- అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ డేట్ ఫిక్స్.
- ఫస్ట్ కట్ చూసిన నాగ్ ఫిదా.
- చరణ్ ‘పెద్ది’తో అఖిల్ పోటీ.
Nagarjuna Lenin: అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు కింగ్ నాగార్జున ఎండ్ కార్డు వేశారు. ఇప్పటికే, వాయిదా పడిన ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందనే ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ సినిమా అనుకున్న సమయానికే విడుదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల సినిమా ‘ఫస్ట్ కట్’ చూసిన నాగార్జున, అఖిల్ నటనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఒక సరికొత్త, అత్యంత శక్తివంతమైన అఖిల్‌ను చూడబోతున్నారని, సినిమా అవుట్‌పుట్ విషయంలో తాను చాలా నమ్మకంగా ఉన్నానని ఆయన వెల్లడించడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
*‘పెద్ది’ మెగా మాస్ సాంగ్ లో శృతి హాసన్.. ఇన్‌స్టా పోస్ట్‌తో అఫీషియల్ కన్ఫర్మేషన్
మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బొర్సే కథానాయికగా నటిస్తోంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత అఖిల్ నుండి వస్తున్న మాస్ ఎంటర్టైనర్ కావడంతో, ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి పాజిటివ్ రివ్యూ ఇవ్వడం సినిమా హైప్‌ను మరింత పెంచింది.
విడుదల తేదీ విషయానికొస్తే, జూన్ 26న ‘లెనిన్(Lenin)’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే సరిగ్గా ఒకరోజు ముందు, అంటే జూన్ 25న రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం కూడా వచ్చే అవకాశం ఉందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, బాక్సాఫీస్ వద్ద ఇద్దరు యంగ్ హీరోల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ, నాగ్ ఇచ్చిన భరోసాతో అక్కినేని ఫ్యాన్స్ ఇప్పుడు జూన్ 26న అఖిల్ బాక్సాఫీస్ వేట కోసం సిద్ధమవుతున్నారు. ఈ పోటీ తెలుగు సినీ చరిత్రలో మరో ఆసక్తికర పోరుగా మారబోతోంది.
