Ariyana Glory : అదిరిందమ్మా అరియానా.. కొత్త కారు.. అందులో షికారు..

కొత్త కారు కొన్న అరియానా గ్లోరీ.. సయ్యద్ సోహైల్, అమర్ దీప్‌లతో ఫస్ట్ రైడ్ ఎంజాయ్ చేసింది..

Ariyana Glory

Ariyana Glory: ‘బిగ్ బాస్’ నాలుగో సీజన్‌లో సందడి చేసిన అరియానా గ్లోరీ ఇటీవల కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వూ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆర్జీవీతో బోల్ట్ టాక్స్, బోల్డ్ పిక్స్ ఇవన్నీ కూడా నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

Tamannaah : తన సమస్యను బయటకు చెప్పలేనంటున్న తమన్నా

అరియానా రీసెంట్‌గా కొత్త కారు కొంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసి తన హ్యాపీనెస్‌ని షేర్ చేసుకుంది. అంతే కాదు తను కొత్తగా కొన్న కియా కారులో ‘బిగ్ బాస్’ 4 రన్నరప్ సయ్యద్ సోహైల్, టీవీ సీరియల్ ఆర్టిస్ట్ అమర్ దీప్‌లతో కలిసి ఫస్ట్ రైడ్‌కి వెళ్లింది.

Balayya : ‘లైగర్’ సెట్‌లో ‘లయన్’..

ఇక కొత్త కారు కొన్నానంటూ అరియానా ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్, నెటిజన్లు విషెస్ చెబుతూ.. ‘అదిరిందమ్మా అరియానా.. కొత్త కారు.. అందులో షికారు’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘బిగ్ బాస్ 5’ బజ్‌కి వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ.. ఇప్పటివరకు హౌస్ నుంచి బయటకు వచ్చిన సరయు, ఉమా దేవిలను ఇంటర్వూ చేసింది. మరోవైపు సినిమాలతోనూ బిజీ అవుతుందీ బోల్డ్ బ్యూటీ.