Ariyana Glory
Ariyana Glory : యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అరియనా తర్వాత సోషల్ మీడియా, బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలో క్యారెక్టర్స్ చేస్తుంది. అరియనా బిగ్ బాస్ సీజన్ 4 తో పాటు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో కూడా పాల్గొంది.(Ariyana Glory)
తాజాగా అరియనా గ్లోరీ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పింది.
Also Read : Ariyana Glory : శివాజీ గారి ఉద్దేశం కరెక్ట్.. శివాజీకి సపోర్ట్ చేసిన అరియనా..
అరియనా గ్లోరీ మాట్లాడుతూ.. నాకు బిగ్ బాస్ లో ఒకసారి వీపు కాలిపోయింది. దాంట్లో నుంచి బయటకు రావడానికి నాకు సంవత్సరం పట్టింది. ఇప్పటికి నాకు ఒక మచ్చ అలా ఉండిపోయింది. బిగ్ బాస్ లో నా వీపు కాలిపోయినప్పుడు నా కెరీర్ అయిపొయింది అని ఏడుస్తుంటే బిందు మాధవి వచ్చి నీ ఫేస్ మీద పడలేదు, ఏం కాదు అని సపోర్ట్ చేసింది. నా లైఫ్ లో అది మర్చిపోలేని ఇన్సిడెంట్. స్కిన్ కాలడం అనేది నేను తలుచుకోలేను అసలు అని తెలిపింది.