Paramapada Sopanam: వైవిధ్యమైన కథతో ‘పరమపద సోపానం’.. విడుదలకు సిద్ధమైన అర్జున్ అంబటి మూవీ
బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా వస్తున్న 'పరమపద సోపానం(Paramapada Sopanam)' రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.
- V Santhosh Kumar
- Published On : April 9, 2026 / 07:19 PM IST
Arjun Ambati Paramapada Sopanam movie is ready for release.
Paramapada Sopanam: బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘పరమపద సోపానం(Paramapada Sopanam)’. అర్ధనారి, తెప్ప సముద్రం వంటి చిత్రాలతో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అర్జున్, ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తూనే హీరోగా ఈ వినూత్న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. నాగ శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని, ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
Adivi Sesh: మూడు నెలల్లో గూఢచారి 2.. హాలీవుడ్ రేంజ్ లో.. మొత్తానికి క్లారిటీ ఇచ్చిన అడివి శేష్
ఈ సినిమాలో జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించగా, స్వయంభూ క్రియేషన్స్ పతాకంపై గణపర్తి నారాయణరావు, తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు సంయుక్తంగా నిర్మించారు. పూరి జగన్నాథ్ శిష్యుడైన నాగ శివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ‘ఈగల్’ చిత్రంతో తన సంగీతంతో మెప్పించిన డేవ్ జాండ్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది.
తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇందులో హీరో అర్జున్ అంబటి లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉండి, సినిమా నేపథ్యంపై ఆసక్తిని కలిగిస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఏప్రిల్ 24న అర్జున్ అంబటి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నారు.
