Adivi Sesh: మూడు నెలల్లో గూఢచారి 2.. హాలీవుడ్ రేంజ్ లో.. మొత్తానికి క్లారిటీ ఇచ్చిన అడివి శేష్
గూఢచారి 2 విడుదలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన అడివి శేష్(Adivi Sesh). ఆ విషయంలో ఫ్యాన్స్ కి నిరాశే.
Adivi Sesh Clarifies Rumors Surrounding Goodachari 2 movie
- గూఢచారి 2 విడుదలపై క్లారిటీ ఇచ్చిన శేష్
- క్వాలిటీ ముఖ్యం అందుకే లేటు అంటున్న శేష్
- 2026 ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు G2
Adivi Sesh: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’ ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తరువాత శేష్ చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గూఢచారి 2’ (G2). బ్లాక్ బస్టర్ గూఢచారి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా గురించి తాజాగా వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చాడు శేష్(Adivi Sesh).
Ester Noronha: ఇకమీదట అలాంటి పాత్రలు చేయను.. చచ్చిపోయినట్టు అనిపించింది.. డబ్బుకోసం ఒప్పుకోలేను
ఈ సినిమా మరో మూడు నెలల్లోనే విడుదలవుతుందన్న వార్తలు వైరల్ అవుతున్న నేపధ్యంలో ఈ ఏడాది చివరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇక శేష్ తన బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘మేజర్’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించడంతో హిందీ నుంచి ఆయనకు ఆరు భారీ ఆఫర్లు వచ్చాయట. అయితే, వాటిలో నాలుగు వార్ సినిమాలు, రెండు బయోపిక్ కథలు ఉండటంతో వాటిని శేష్ సున్నితంగా తిరస్కరించారు. ఒకే రకమైన జోనర్లకు పరిమితం కాకుండా, విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇక, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఆ సినిమా తనకు పూర్తి సంతృప్తిని ఇచ్చిందని శేష్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మళ్లీ యుద్ధ సినిమాలు లేదా బయోపిక్‌లు చేసే ఉద్దేశం లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం తన దృష్టి అంతా ‘G2’ పైనే ఉందని, ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన మార్కెట్‌ను కాపాడుకుంటూనే వైవిధ్యమైన పాత్రల చేస్తానన్న ఆయన నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో, అడివి శేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
