Malaika Arora: అన్యోన్యజంటగా వెలిగిపోతున్న అర్జున్ మలైకా!

బీటౌన్ లో ప్రేమకథలకు లెక్కేలేదు.. లవ్ బర్డ్స్ కు కొదువేలేదు. అయితే, అందులో కాస్త హాట్ అండ్ ఢిపిరేట్ ల‌వ్ స్టోరీ వీళ్లది. ఎవరి గురించి చెప్తున్నామో ఇప్పటికే అర్ధమయ్యే ఉంటుంది.

Malaika Arora: బీటౌన్ లో ప్రేమకథలకు లెక్కేలేదు.. లవ్ బర్డ్స్ కు కొదువేలేదు. అయితే, అందులో కాస్త హాట్ అండ్ ఢిపిరేట్ ల‌వ్ స్టోరీ వీళ్లది. ఎవరి గురించి చెప్తున్నామో ఇప్పటికే అర్ధమయ్యే ఉంటుంది. ఔను, ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీకి దగ్గరైన మలైకా అరోరా, థర్టీ ప్లస్ లో ఉన్న అర్జున్ కపూర్ ల‌దే. సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న త‌ర్వ‌త మలైకా బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ ప్రేమ మైకంలో మునిగి తేలుతుంది.. దేశవిదేశాలకు షికార్లు చేస్తుంది.

Malaika Arora: ముసలామె అంటూ ట్రోల్స్.. కామెంట్స్ ఆపేసిన మలైకా!

కొడుకు వ‌య‌స్సు ఉన్న అర్జున్ క‌పూర్ తో రొమాన్స్ ఏంటని విమ‌ర్శ‌లు వెల్లువెత్తినా ఏ మాత్రం లెక్క చేయ‌కుండా బీ టౌన్ వీధుల్లో కూడా చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు ఈ ప్రేమ జంట. ఇప్పటికే చాలాసార్లు చాలా వేడుకల్లో.. ఎన్నో పార్టీల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఈ జంట ఇప్పుడు మరోసారి దీపావళి సెలబ్రేషన్స్ లో కూడా అంతే స్పెషల్ గా కనిపించారు. మలైకా తాజాగా అనిల్ కపూర్ ఇంట ఏర్పాటు చేసిన దీపావళి పార్టీలో ప్రియుడు అర్జున్ కపూర్ తో కలిసి ప్రత్యక్షమైంది.

Bollywood Couples : పెళ్లి అప్పుడే అంటున్న బాలీవుడ్ కపుల్స్..!

ఈ పార్టీకి కపూర్ కుటుంబం మొత్తం హాజరయ్యారు. అర్జున్ సోదరీమణులు అన్షులా, జాన్వీ, ఖుషీ కపూర్లతో పాటు వారి తండ్రి బోనీ కపూర్ ఈవెంట్ పెద్ద అతిథిగా హాజరవగా ఈ పార్టీకి అర్జున్ నానమ్మ నిర్మల్ కపూర్ కూడా హాజరయ్యారు. అయితే.. అంతమంది అందగత్తెలున్నా ఈ ఈవెంట్ స్పెషల్ అట్రాక్షన్ మలైకా అర్జున్ లదే. పింక్, ఆకుపచ్చ రంగులో మనీష్ మల్హోత్రా చీరలో సంప్రదాయ నెక్లెస్, అందుకు తగ్గ గాజులతో మలైకా మైమరిపిస్తే.. బ్లాక్ కుర్తా పైజామాలో అర్జున్ మ్యాన్లీగా కనిపించాడు.

Video: వింతగా నడిచిన మలైకా అరోరా.. ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు

అర్జున్ మైలైకా ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి మనసులో భావాలను బయటపెడితే.. ఫోటో చూసిన నెటిజన్లు ఇందుకు కదా మలైకా వెనక అర్జున్ బొంగరంలా తిరిగేదని మలైకా బ్యాక్ లెస్ అందాలను తెగపొగిడేస్తున్నారు. అసలే మలైకా దీపావళిని తన అలంకరణలో చూపిస్తే అర్జున్ దానికి కవిత్వాన్ని జోడించి సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు