Malaika Arora: ముసలామె అంటూ ట్రోల్స్.. కామెంట్స్ ఆపేసిన మలైకా!

మలైకా అరోరా ఏం చేసినా అది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. అందుకే ఆమె కూడా ఏదో ఒక కారణంతో నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉంటుంది. బాలీవుడ్ ఫిట్‌నెస్ నటీమణులలో ఒకరైన మలైకా..

Malaika Arora: ముసలామె అంటూ ట్రోల్స్.. కామెంట్స్ ఆపేసిన మలైకా!

Malaika Arora (image : Instagram)

Updated On : October 21, 2021 / 5:50 PM IST

Malaika Arora: మలైకా అరోరా ఏం చేసినా అది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. అందుకే ఆమె కూడా ఏదో ఒక కారణంతో నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉంటుంది. బాలీవుడ్ ఫిట్‌నెస్ నటీమణులలో ఒకరైన మలైకా అరోరాని ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా పిలుస్తూ ఉంటారు. అదే సమయంలో మలైకా ముసలామె అయిందని.. పిల్లాడితో రొమాన్స్ ఏంటని కామెంట్స్ వినిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా మలైకా చేసే వీడియోలకు, పోస్టులపై నెటిజన్స్ విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు. యమ్మీ మమ్మీ మలైకా అంటూ ఓ పేరు కూడా పెట్టేశారు.

Telugu Senior hero’s: సస్పెన్స్‌లో సీనియర్ హీరోలు.. రిలీజ్ ఎప్పుడో?!

బోల్డ్ డ్రెస్సింగ్ స్టైల్‌తో హెడ్‌లైన్స్‌లో నిలిచే మలైకా కొన్నిసార్లు డ్రెస్సింగ్ పై ట్రోలింగ్‌ ఎదుర్కుంటుంది. ఇటీవల, మలైకా తన యోగా భాగస్వామి సర్వేష్ శశితో కలిసి చేసిన ఓ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఇద్దరూ మ్యూజిక్ కి తగ్గట్లుగా స్టెప్పులేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనిపై నెటిజన్ల ట్రోలింగ్ కూడా దారుణంగానే ఉంది. మలైకాకి అసలు బుద్ధిలేదని కొందరంటే.. ముసలమ్మ అయినా ఈ తిప్పుడేంటని కొందరూ తీవ్రంగా మండిపడ్డారు.

Jagapathi Babu: బాలీవుడ్‌లో జగ్గూభాయ్ ఎంట్రీ.. ఇక గర్జనే!

మలైకా ఈ మధ్య కాలంలో బాతులా నడుస్తుందని.. ఇలా ఎందుకు నడుస్తుందో కాస్త చెప్పాలని కొందరు కామెంట్ చేస్తుంటే.. కావాలని తన వయసు కవర్ చేసుకునేందుకే ఈ చిందులేస్తుందని మరికొందరు ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే మలైకా డాన్స్ వీడియోను వల్గర్ అని నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మలైకా ట్రోల్‌లకు సమాధానంగా కామెంట్స్ సెక్షన్ ఆపేసింది. అన్నట్టు మలైకా తనకంటే 11 ఏళ్ల చిన్నవాడైన అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)