Allu Arjun : బన్నీ సరసన ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ హీరోయిన్.. త్రివిక్రమ్ సినిమాలో..?
అల్లు అర్జున్ హీరోగా ఏఐ టెక్నాలజీతో ఓ అందమైన హీరోయిన్ త్వరలో వెండితెరపైకి తళుక్కుమననుంది.
- Saketh U
- Published On : August 1, 2023 / 01:48 PM IST
Artificial Intelligence Heroine will place in Allu Arjun Trivikram Movie
Allu Arjun Movie : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతాలకు వేదికవుతోంది. విద్య, వైద్యం, వ్యాపారం, వ్యవసాయం ఇలా కృత్రిమ మేథ ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. దాదాపు అన్ని వ్యవస్థల్లోనూ చొచ్చుకు వెళ్లిన ఏఐ టెక్నాలజీ ఇప్పుడు సినీ ప్రపంచాన్ని మాయ చేస్తోంది. ఏఐ యాంకర్లతో టీవీ చానళ్లు ప్రయోగాలు చేస్తుంటే సినీ ఇండస్ట్రీ ఓ అడుగు ముందుకేసి నటీనటులను తెరపైకి తెస్తోంది. అల్లు అర్జున్ హీరోగా ఏఐ టెక్నాలజీతో ఓ అందమైన హీరోయిన్ త్వరలో వెండితెరపైకి తళుక్కుమననుంది.
అల్లు అర్జున్ సరసన ఎందరో అందమైన భామలు నటించారు. యాక్షన్ హీరోగా అదరగొట్టే స్టైలిష్ స్టార్ పక్కన త్వరలో ఓ అందమైన తార నటించనుంది. ఆ తార కూడా కొత్తగా సినిమాల్లోకి వస్తోంది. మైమరిపించే అందంతో ప్రేక్షకులు కట్టిపడేసేలా ఉండే ఆ తార.. మన దేశానికి చెందిన నటి కాదు, అలా అని ఏ హాలీవుడ్ నుంచో తీసుకురావడం లేదు. పూర్తిగా టెక్నాలిజీతో రూపొందిస్తున్న బొమ్మ. కృత్రిమ మేథతో పనిచేసే భామ అల్లు అర్జున్ పక్కన నటించనుందట.
త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమాలో కృత్రిమ మేథతో పనిచేసే బొమ్మ భామను హీరోయిన్‌గా పెట్టాలని అనుకుంటున్నట్టు ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు చాలా అందంగా ఉండటంతో సినిమాలో ఓ హీరోయిన్‌గా ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు జీన్స్ సినిమాలో ఐశ్వర్యరాయ్ చిత్రాన్ని గ్రాఫిక్‌తో చిత్రీకరించి అప్పట్లో వాహ్వా అనిపించారు డైరెక్టర్ శంకర్. మళ్లీ ఆయనే రోబో చిత్రంలో రజనీని రోబోగా చూపెట్టి ప్రేక్షకుల ఆదరణ పొందారు. ఈ తరహా ప్రయోగాలకు ఇన్నాళ్లు కోలీవుడ్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే ఈ సారి కృత్రిమ మేథతో అదే తరహా ప్రయోగం చేయాలని చూస్తోంది టాలీవుడ్. మరి ఇది ఎంతవరకు నిజమో అధికారికంగా చెప్పేదాకా తెలియదు.
