Arvind Krishna : ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిస్తున్న హీరో.. బాస్కెట్ బాల్ లో దూసుకుపోతున్న అరవింద్ కృష్ణ..

అరవింద్ కృష్ణ బాస్కెట్ బాల్ ప్లేయర్ అని తెలిసిందే. గతంలో నేషనల్ లెవల్లో కూడా అరవింద్ కృష్ణ బాస్కెట్ బాల్ ఆడాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్లో బాస్కెట్ బాల్ తో దుమ్ములేపుతున్నాడు ఈ హీరో.

Arvind Krishna Plays Basket Ball International Leagues and busy with Movies

Arvind Krishna : ఆలస్యం అమృతం, ఇట్స్ మై లవ్ స్టోరీ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అరవింద్ కృష్ణ. ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేస్తూనే, సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో A మాస్టర్ పీస్ అనే ఓ సూపర్ హీరో తరహా సినిమాతో కూడా రాబోతున్నాడు అరవింద్ కృష్ణ. ఇప్పుడు సినిమాలతో కాకుండా తన ఆటతో వైరల్ అవుతున్నాడు అరవింద్.

అరవింద్ కృష్ణ బాస్కెట్ బాల్ ప్లేయర్ అని తెలిసిందే. గతంలో నేషనల్ లెవల్లో కూడా అరవింద్ కృష్ణ బాస్కెట్ బాల్ ఆడాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్లో బాస్కెట్ బాల్ తో దుమ్ములేపుతున్నాడు ఈ హీరో. ది ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ (FIBA) ప్రస్తుతం 3BL అనే లీగ్‌ లు నిర్వహిస్తుంది. తాజాగా FIBA గత వారం జపాన్ లో సాగామిహర 3BL లీగ్‌ను నిర్వహించింది. ఈ లీగ్ లో పలు దేశాల నుంచి కూడా టీమ్స్ పాల్గొనగా హైదరాబాద్ నుంచి ఓ టీం పాల్గొంది. ఈ టీంకి అరవింద్ కృష్ణ కెప్టెన్ కావడం గమనార్హం.

అరవింద్ కృష్ణ టీమ్ క్వాలిఫైయర్స్‌కి కూడా ఎంటర్ అయింది. దీంతో ప్రస్తుతం అరవింద్ కృష్ణ వైరల్ గా మారారు. అలాగే ఈ లీగ్ లో మిగిలిన గేమ్స్ కొన్ని రోజుల గ్యాప్ తర్వాత వచ్చే సంవత్సరం నిర్వహించనున్నారు. FIBA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చాంపియన్ లీగ్‌లో ఇండియా నుంచి పాల్గొన్న ఏకైక ఆటగాడు అరవింద్ కృష్ణ కావటం విశేషం. ఈ గేమ్ లో అరవింద్ కృష్ణ బాగా ఆడి అనంతరం ఇండియాకు తిరిగి వచ్చాక మీడియాతో మాట్లాడారు. అలాగే తన సోషల్ మీడియాలో కూడా దీని గురించి పోస్టులు పెట్టారు.

Also Read : పదేళ్ల క్రితం చరణ్ ని కలిసుంటే పెళ్లి చేసుకోమని అడిగేదాన్ని.. నటి జ్ఞానేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు..

అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. క్రికెట్‌లో ఐపీఎల్ లాగే బాస్కెట్ బాల్‌లో 3BL లీగ్‌ను నిర్వహిస్తున్నారు. ముగ్గురు ప్లేయర్స్ తో పాటు ఓ సబ్‌స్టిట్యూట్ కూడా ఉంటారు. ఇలాంటి ప్రెస్టీజియస్ చాంపియన్ షిప్‌లో పాల్గొనటం ఎంతో గొప్పగా, గర్వంగా, గౌరవంగా ఉంది. ఓ పక్క నేను సినిమాలతో బిజీగా ఉన్నాను. అలాగే మరో పక్క ఈ 3BL లీగ్‌లో పాల్గొంటున్నాను. ఈ లీగ్ నాకు బాస్కెట్ బాల్ గేమ్ లో మంచి బ్రేక్ ఇచ్చింది అని అన్నారు. ఇలా హీరోగా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ప్లేయర్ గా ఇంటర్నేషనల్ లో గేమ్స్ ఆడుతున్నారంటే గ్రేట్ అనే చెప్పొచ్చు. దీంతో ప్రస్తుతం అంతా అరవింద్ కృష్ణని అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు