Ashu Reddy Engagement: 9.5 కోట్లు మోసం చేసిందనే ఆరోపణలు.. కేసు నడుస్తుండగా నిశ్చితార్థం చేసుకున్న అషురెడ్డి..
ఇలాంటి సమయంలో అషురెడ్డి నిశ్చితార్థం చేసుకుంది. (Ashu Reddy)
- Saketh U
- Updated on- May 8, 2026 / 05:05 PM IST
Ashu Reddy Got Engaged While Facing Cheating Allegations
Ashu Reddy Engagement : సోషల్ మీడియాతో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకొని ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగా ఉంది. అప్పుడప్పుడు పలు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా అషురెడ్డిపై పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఏకంగా 9.5 కోట్లు తీసుకొని మోసం చేసిందని ఓ NRI సాక్ష్యాలతో బయటపెట్టి ఆరోపణలు చేస్తున్నారు. కోర్టులో ఈ కేసు కూడా నడుస్తుంది.
అయితే ఇలాంటి సమయంలో అషురెడ్డి నిశ్చితార్థం చేసుకుంది. తాజాగా తన సోషల్ మీడియాలో నిశ్చితార్థం చేసుకున్నట్టు ఓ అబ్బాయి చేతిని పట్టుకున్న ఫోటోని, సాంప్రదాయంగా తయారై నిశ్చితార్థపు యంగ్ ని చూసుకుంటున్న తన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఆ అబ్బాయి ఫోటో చూపించకపోవడం గమనార్హం. దీంతో ఇలాంటి ఆరోపణలు, వివాదాలు, కోర్టు కేసుల మధ్య అషురెడ్డిని పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయి ఎవరు అని చర్చగా మారింది.
Also Read : Mr Work From Home : మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్న పాయల్ రాధాకృష్ణ.. రిలీజ్ ఎప్పుడంటే..
పెళ్లి పేరుతో ఎన్నారై ధర్మేంద్రను మోసం చేసి రూ. 9.5 కోట్లు కాజేసినట్లు అషు రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అషు రెడ్డికి సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ కూడా బయటపడ్డాయి. కేవలం కోటిన్నర ఇప్పుడు ఇస్తానని, మిగిలిన డబ్బును జీవితంలో స్థిరపడిన తర్వాతే చెల్లిస్తానని ధర్మేంద్రకు చెప్పినట్టు ఆడియో రికార్డింగ్స్ లో ఉంది. తాను చెప్పినట్లు వినకపోతే ఫేక్ వేధింపుల కేసు కూడా పెడతానని హెచ్చరించినట్లు ఆ రికార్డింగ్స్ లో ఉంది. ఇలాంటి సమయంలో అషురెడ్డి నిశ్చితార్థంను చేసుకోవడం చర్చగా మారింది.
