Mr Work From Home : మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్న పాయల్ రాధాకృష్ణ.. రిలీజ్ ఎప్పుడంటే..
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. (Mr Work From Home)
Mr Work From Home
Mr Work From Home : త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా తెరకెక్కుతున్న ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మాణంలో మధుదీప్ చెలికాని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమాలో త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ తో పాటు అనీష్ కురువిల్లా, శివాజీరాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, సివిఎల్ నర్సింహారావు, గుండు సుదర్శన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండు.. ఇలా చాలామంది కమెడియన్స్ కూడా నటిస్తున్నారు.
ప్రెస్ మీట్లో నిర్మాత అరవింద్ మాట్లాడుతూ.. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా క్రియేటివ్‌గా, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇది అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్. సమ్మర్లో ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఈ సినిమా మే 15న రిలీజ్ కానుంది. సినిమాను థియేటర్స్‌లో చూసి నచ్చితే పదిమందికి చెప్పండి అని అన్నారు. డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ.. ఈ సినిమా మనం రోజువారీగా చూసే పాత్రలు, సంఘటనలతో సరదాగా ఉంటుంది. ఇందులో అద్భుతమైన ప్రేమకథ ఉంది. ఆ ప్రేమకథలోని కాన్ఫ్లిక్ట్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమాలో చూపించిన క్లైమాక్స్ నిజ జీవితానికి ఉపయోగపడుతుంది అని అన్నారు.
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. నాకు గుర్తింపు ఇచ్చింది తెలుగు పరిశ్రమ. నేను ఇక్కడే సెటిల్ అవ్వాలని భావిస్తున్నాను. వరుసగా ఇక్కడ సినిమాలు రావడం, ఇటీవల పాపం ప్రతాప్ హిట్ అవ్వడం ఆనందంగా ఉంది అని తెలిపింది. హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ కూడా ఉంది సినిమాలో. మే 15న ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. పాయల్ లక్ ఈ సినిమాకి కలిసి రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రామ్ దాస్ మాట్లాడుతూ.. ఈషాతో హిట్ అందుకున్న త్రిగుణ్, పాపం ప్రతాప్ తో హిట్ అందుకున్న పాయల్ రాధాకృష్ణ ఇద్దరూ కలిసి ఈ సినిమాలో చక్కగా నటించారు. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మంచి కాన్సెప్ట్‌తో రూపొందించారు అని అన్నారు.
