×
Ad

Ashwini Dutt : ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరంలో మాది అర్ధ శత జయంతి.. ఇప్పటికి ప్రాజెక్టు K తీస్తున్నా..

అన్నీ మంచి శకునములే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా హీరో నాని, దుల్కర్ సల్మాన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ మాట్లాడుతూ..

  • Published On : May 15, 2023 / 06:48 AM IST

Ashwini Dutt Speech in Anni Manchi Shakunamule Pre Release Event

Anni Manchi Shakunamule  :  సంతోష్ శోభన్, మాళవిక నాయర్(Malavika Nayar) జంటగా నందిని రెడ్డి(Nandini Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అన్నీ మంచి శకునములే'(Anni Manchi Shakunamule). స్వప్న సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మే 18న థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ఎన్టీఆర్(NTR) ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన అనంతరం ఓ చక్కని ఫ్యామిలీ సినిమాలా అనిపించింది. చిత్రయూనిట్ గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. నిన్న ఆదివారం నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా హీరో నాని, దుల్కర్ సల్మాన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

Santosh Sobhan : అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాము అని కష్టాల్లా చెప్తారు.. అవి కష్టాలేం కావు..

ఈ ఈవెంట్ లో వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ మాట్లాడుతూ.. దైవ సమానులైన ఎన్టీఆర్ గారు పేరు పెట్టి ఆశీర్వదించిన సంస్థ ఇది. ఆయన శతజయంతి సంవత్సరంలో మా సంస్థ యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ యాభయవ సంవత్సరంలోనే అమితాబ్, ప్రభాస్, దీపికా లాంటి స్టార్స్ తో ప్రాజెక్ట్ K తీస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్లు ఈ సంస్థను నేను నడిపాను. గత రెండేళ్లుగా మా పిల్లలు నడుపుతున్నారు. వాళ్ళని చూస్తుంటే ముచ్చటేస్తుంది, అలాగే ఈర్ష్య కూడా కలుగుతుంది ఇలాంటి ఆలోచన నాకు రాలేదేంటి అని. ఇన్నాళ్లు నాతో పనిచేసిన ఎన్టీఆర్ దగ్గర్నుంచి దుల్కర్ వరకు అందరికి కృతజ్ఞతలు. ఇన్నాళ్లు నన్ను నడిపించిన ఎంతోమంది సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు. ఈ అన్నీ మంచి శకునములు సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని అన్నారు.