August Movies : అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ ఆగస్టులో.. సినిమా ఫ్యాన్స్ కి ప్రతి వారం పండగే..

అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ అంతా ఆగస్ట్ లోనే రెడీ అవుతోంది. (August Movies)

  • Published on- August 1, 2026 / 07:39 AM IST

August Movies

August Movies : జులై కంప్లీట్ అయిపోయింది. సమ్మర్ నుంచి సరైన హిట్ లేక డిజప్పాయింటైన టాలీవుడ్ కి మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ లాంటి సినిమాలు వరుసగా హిట్ అయి కాస్త రిలాక్సేషన్ ఇచ్చాయి. వీటికితోడు ఆగస్ట్ లో రిలీజయ్యే సినిమాలన్నీ పెద్దవే కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

సమ్మర్ లో సినిమా చూద్దామంటే సరైన సినిమా లేదు. స్టార్ల సినిమా అసలు అడ్రసే లేదు. కానీ అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ అంతా ఆగస్ట్ లోనే రెడీ అవుతోంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకూ వరసపెట్టి ఇంట్రస్టింగ్ సినిమాలు రిలీజవుతున్నాయి.

Also Read : Venky Atluri : ఏమయ్యా వెంకీ.. ఇంక తెలుగు హీరోలతో సినిమా చేయవా..?

మోస్ట్ హిలేరియస్ ఇంట్రస్టింగ్ మూవీగా థియేటర్లోకొస్తోంది కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ డైరెక్షన్లో వరుణ్ తేజ్ హీరోగా హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా ఆగస్ట్ 7న కొరియన్ కనకరాజు రిలీజవుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక అదే వారం డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి తెరకెక్కించిన అనకాపల్లి అనే రా & రస్టిక్ సినిమా కూడా రాబోతుంది.

ఆగస్ట్ సెకండ్ వీక్ ఇండిపెండెన్స్ డే సీజన్ లో ఇంట్రస్టింగ్ సినిమా రిలీజవుతోంది. తమిళ్ స్టార్ హీరో సూర్య, తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో సితార, శ్రీకర, ఫార్చ్యూన్ ఫోర్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న విశ్వనాధ్ అండ్ సన్స్ ఆగస్ట్ 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా టీజర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే ఫుల్ హైప్ తెచ్చేస్తున్నాయి. సూర్య హీరో కావడంతో తెలుగుతో పాటు తమిళ్ లో కూడా రిలీజ్ అవుతుంది. అదే వారం పల్లబురుసు, అగధ అనే రెండు సినిమాలు కూడా ఆగస్టు 14 వస్తున్నాయి. MS రాజు దర్శకత్వంలో వస్తున్న అగధ పైన కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.

Also Read : Rajmouli : మాకు నమ్మకం లేదు దొర.. రాజమౌళి మహేష్ బాబు సినిమాపై ఫ్యాన్స్ కూడా..

ఆగస్టు థర్డ్ వీక్ మాత్రం ఎమోషనల్ యాక్షన్ మూవీ రాబోతోంది. రవితేజ హీరోగా శివనిర్వాణ డైరెక్షన్లో ఇరుముడి సినిమా తెరకెక్కుతోంది. ఆగస్ట్21న థియేటర్లోకొస్తున్నఈమూవీలో రవితేజ అయ్యప్పస్వామి భక్తుడిగా కనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో రవితేజ చేసిన సినిమాలకు కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఉండబోతోంది ఇరుముడి మూవీ. ఈ సినిమాలో అయ్యప్ప స్వామి సాంగ్స్ కి ఇప్పటికే ఫుల్ హైప్ వచ్చింది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న రవితేజ ఈ సినిమాతో హిట్ కొడతాడని అందరూ వెయిట్ చేస్తున్నారు.

ఆగస్ట్ లాస్ట్ వారం బ్యాడ్ బాయ్ క్యారెక్టర్ లో వస్తున్నాడు యశ్. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో యశ్ చేస్తున్న టాక్సిక్ మూవీ ఆగస్ట్ 26న థియేటర్లోకొస్తోంది. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా గా బోల్డ్ గా తెరకెక్కుతున్న టాక్సిక్ లో యశ్ తో పాటు నయనతార, కియారా అద్వానీ లాంటి స్టార్ హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్స్ తో ఈ సినిమా అడల్ట్ సినిమా అని అంచనాలు పెరిగిపోయాయి. కెజిఎఫ్ తర్వాత యశ్ చేస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై హైప్ ఉంది. ఇక ఆగస్టు 28 శర్వానంద్, సంపత్ నంది కాంబోలో వస్తున్న రా & రస్టిక్ భోగి సినిమా వస్తుందన్నారు కానీ అది వాయిదా పడేలా కనిపిస్తుంది. ఇలా ఆగస్ట్ లో ప్రతివారం ఇంట్రస్టింగ్ సినిమాలతో అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ రెడీ అవుతోంది.