HANUMAN : హ‌నుమాన్ నుంచి థ‌ర్డ్ సింగిల్ రిలీజ్‌.. ఆక‌ట్టుకుంటున్న‌ ‘ఆవకాయ.. ఆంజనేయ..’ సాంగ్‌

హ‌నుమాన్‌ మూవీ నుంచి మూడో పాట‌ను విడుద‌ల చేశారు. 'ఆవ‌కాయ.. ఆంజ‌నేయ‌.. క‌థ మొద‌లెట్టినాడు చూడ‌వ‌య్యా' అంటూ ఈ పాట సాగుతోంది.

టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వర్మ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా ‘హ‌నుమాన్‌’. అమృత అయ్యర్ క‌థానాయిక‌గా న‌టిస్తోన్న ఈ చిత్రం నుంచి తాజాగా మూడో పాట‌ను విడుద‌ల చేశారు. ‘ఆవ‌కాయ.. ఆంజ‌నేయ‌.. క‌థ మొద‌లెట్టినాడు చూడ‌వ‌య్యా’ అంటూ ఈ పాట సాగుతోంది. అనుదీప్ దేవ్ కంపోజ్ చేయ‌గా సాహితీ గాలిదేవర పాడారు. ఈ పాట‌ను వింటుంటే గూస్ బంప్స్ వ‌స్తున్నాయి.

వ‌రలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కే నిరంజన్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్ లు సంగీతాన్ని అందిస్తున్నారు. 2024 జ‌న‌వ‌రి 12న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. భార‌త‌ లాంగ్వేజ్స్ తో పాటు శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ ఇలా ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం 11 భాషల్లో ఈ సినిమా విడుద‌ల కానుంది.

Hi Nanna: స్టైలిష్‌గా నాని, హాట్ లుక్‌లో శ్రుతిహాస‌న్.. అదిరిపోయిన ‘ఓడియమ్మా’ పాట‌

కాగా ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హనుమంతుడి వల్ల ఒక కుర్రాడికి సూపర్ పవర్స్ రావడం, ఆ తరువాత జరిగిన సంఘటనలు, ఆ కుర్రాడు ఎదుర్కొన్న విషయాలు ఈ మూవీలో చూపించ‌బోతున్న‌ట్లుగా తెలుస్తోంది. జాంబిరెడ్డి త‌రువాత తేజ స‌జ్జా, ప్ర‌శాంత్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు