Avengers: Doomsday : డాక్టర్ డూమ్ హవా – ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ వచ్చేస్తుంది..

తాజాగా ఈ సినిమా నుంచి పలు కొత్త పోస్టర్లను, డాక్టర్ డూమ్స్ కొత్త లుక్స్ లో కూడా రిలీజ్ చేసారు. (Avengers: Doomsday)

  • Published on- November 3, 2026 / 09:35 PM IST

Avengers Doomsday

Avengers: Doomsday : మార్వెల్ స్టూడియోస్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా పైనుంచి టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చేసారు. ఇప్పటికే హాలీవుడ్ నుంచి ఇండియా వరకు అన్ని చోట్ల ఈ సినిమా కోసం మర్వెల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి పలు కొత్త పోస్టర్లను, డాక్టర్ డూమ్స్ కొత్త లుక్స్ లో కూడా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్లలో మార్వెల్ సినీ విశ్వంలోని అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుల్లో ఒకరైన డాక్టర్ డూమ్‌ను ప్రధానంగా చూపించారు.

ఈ సినిమా 2026 డిసెంబర్ 17న భారతదేశంలోని థియేటర్లలో విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 4DX, RealD 3D, ScreenX, Dolby, మార్వెల్ స్టూడియోస్ అందిస్తున్న ఇన్ఫినిటీ విజన్ వంటి ప్రీమియం ఫార్మాట్లలోనూ ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రీమియం ఫార్మాట్లులో 4DX, RealD 3D, ScreenX, Dolby, Infinity Vision లలో కూడా డుదల కానుంది.