బాబోయ్.. రెండు రోజుల్లో 2వేల కోట్లా?

ఓవరాల్‌గా 46 దేశాల్లో అవెంజర్స్ రిలీజ్ అయ్యింది.. అమెరికాలో ఇప్పటివరకు 'స్టార్‌వార్స్' పేరిట ఉన్న ప్రివ్యూ రికార్డ్‌ని కూడా ఎండ్ గేమ్ బీట్ చేసేసింది..

  • Publish Date - April 27, 2019 / 01:35 PM IST

ఓవరాల్‌గా 46 దేశాల్లో అవెంజర్స్ రిలీజ్ అయ్యింది.. అమెరికాలో ఇప్పటివరకు ‘స్టార్‌వార్స్’ పేరిట ఉన్న ప్రివ్యూ రికార్డ్‌ని కూడా ఎండ్ గేమ్ బీట్ చేసేసింది..

 అవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్‌ల సునామీ సృష్టిస్తుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ అయిన అవెంజర్స్, విడుదలైన రెండు రోజుల్లోనే.. అక్షరాలా.. రూ.2,130 కోట్లు కొల్లగొట్టడం విశేషం. మొదటిరోజే రూ.1186 కోట్లు వసూలు చేసినట్టు అంచనా వేస్తున్నారు. చైనాలో రెండు రోజులముందే రిలీజ్ అవగా, అక్కడ రూ.1075 కోట్లు కలెక్ట్ చేసింది. అమెరికాలో ఇప్పటివరకు ‘స్టార్‌వార్స్’ పేరిట ఉన్న ప్రివ్యూ రికార్డ్‌ని కూడా ఎండ్ గేమ్ బీట్ చేసేసింది. ఓవరాల్‌గా 46 దేశాల్లో అవెంజర్స్ రిలీజ్ అయ్యింది. ఇక ఇండియా విషయానికొస్తే, ఫస్ట్ డే కలెక్షన్స్ లిస్టులో టాప్-3 లో ఉంది. ఇండియాలో మొదటిరోజు రూ.63 కోట్ల 21 లక్షల గ్రాస్, రూ.53 కోట్ల షేర్ సాధించింది.

ఈ మూవీని దాదాపు 2,400 స్క్రీన్స్‌లో విడుదల చేసారు. ఒక హాలీవుడ్ సినిమా ఇండియాలో ఇన్ని థియేటర్స్‌లో రిలీజవడం ఇదే మొదటిసారి. ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ ఫస్ట్ డే రూ.132.81 కోట్ల రికార్డ్ సేఫ్‌గా ఉంది. ‘2.ఓ’ రూ.67.79 కోట్ల రికార్డు కూడా అలాగే ఉంది. ‘అవెంజర్స్’ రూ.63.21 కోట్లతో మూడవ ప్లేస్‌లో ఉండగా, రూ.59.68 కోట్లతో ‘థగ్స్ ఆఫ్ హిందూస్ధాన్’ నాలుగవ స్థానంలో, రూ.54.71 కోట్లతో ‘ప్రేమ్ రతన్ ధన్‌పాయో’ అయిదవ స్థానంలో ఉన్నాయి. తెలుగులో అవెంజర్స్ దెబ్బకి ‘మజిలీ’, ‘చిత్రలహరి’, ‘జెర్సీ’, ‘కాంచన-3’ సినిమాలకు గట్టి ఎఫెక్టే పడింది. ఈ సిరీస్‌లో లాస్ట్ మూవీ కావడం, సూపర్ హీరోస్ అందరూ ఒకే సినిమాలో కనిపించడం, కయర్షియల్ సినిమాల స్థాయిలో, ఆడియన్స్ ఊహించని విధంగా సెంటిమెంట్, ఎమోషన్స్ ఉండడం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ముందు ముందు అవెంజర్స్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.