Ramaraju For Bheem: డియర్ బ్రదర్ తారక్.. నా ప్రామిస్ నిలబెట్టుకుంటా!..

  • Publish Date - October 6, 2020 / 11:48 AM IST

RRR – Ramaraju For Bheem: లాక్‌డౌన్ సడలింపుతో దాదాపు ఏడు నెలల తర్వాత RRR షూటింగ్ మొదలైంది. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ చిత్రబృందం షూటింగ్ ప్రారంభించింది. ముందుగా ఎన్టీయార్‌ వీడియో(Ramaraju For Bheem) కు సంబంధించిన షూటింగ్ జరుగబోతోంది.

చిత్ర షూటింగ్ ప్రారంభం కావడం గురించి, అలాగే ‘‘రామరాజు ఫర్ భీమ్’’ వీడియో గురించి రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ‘‘తిరిగి ‘RRR’ సెట్స్‌లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. డియర్ బ్రదర్ తారక్.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నది సిద్ధమవుతోంది. నేను ప్రామిస్ చేసిన విధంగా అక్టోబర్ 22న నీకు మంచి బహుమతి ఇవ్వబోతున్నా..’’ అంటూ చెర్రీ ట్వీట్ చేశాడు.

‘‘మళ్లీ RRR సెట్స్ మీదకు రావడం చాలా ఉత్సాహంగా ఉంది జక్కన్న. వెయిట్ చేయలేకపోతున్నాను బ్రదర్ చరణ్. అక్టోబర్ 22న ‘రామరాజు ఫర్ భీమ్’.. అంటూ తారక్ ట్వీట్ చేశాడు.