Baa Baa Black Sheep teaser out now
Baa Baa Black Sheep : టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్, రాజారవీంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బా బా బ్లాక్ షీప్. గుణి మంచికంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ రోజు జరిగిన అనుకోని ఓ ఘటనతో 6 వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
స్టీఫెన్, ఆనంద్ సంగీతాన్నిఅందిస్తుండగా.. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను స్టార్ హీరో శర్వానంద్ విడుదల చేశారు. అనంతరం మూవీ యూనిట్‌ను అభినందించారు. ‘చెప్పుకోడానికి ఇది మామూలు కథ కాదు. అండ పిండ బ్రహ్మాండాలను కూడా అల్లాడించే కథ’, ‘ఏం చెప్పాలనుకుంటున్నారో కాస్త క్లారిటీగా చెప్పవా’ అనే డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి.
Anasuya Bharadwaj : జిమ్‌లో అనసూయ హాట్ ఫోటోలు..
ఈ చిత్ర టీజర్ విడుదల సందర్భంగా వేణు దోనేపూడి మాట్లాడుతూ ..సినిమా మొత్తాన్ని మేఘాలయా రాష్ట్రంలో లోనే పూర్తి చేశామని చెప్పారు. చిరపుంజి వంటి అద్భుతమైన లొకేషన్స్‌లోనూ చిత్రీకరించాం. అతి తక్కువ రోజుల్లోనే పక్కా ప్లానింగ్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అని చెప్పారు.
Eesha Rebba : రెడ్ డ్రెస్‌లో కుర్రాళ్లను కవ్విస్తున్న హీరోయిన ఈషా రెబ్బా