BiggBoss Non Stop : నా ఇంటికి వచ్చేసాను.. బిగ్‌బాస్‌‌లో బాబా భాస్కర్ వైల్డ్ కార్డు ఎంట్రీ..

బిగ్‌బాస్‌ కి అనుకున్నంత క్రేజ్ రావడంలేదు. ఇక దీనికి హైప్ తీసుకురావడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. ఇందులో భాగంగానే వైల్డ్ కార్డు ఎంట్రీని.......

Baba Bhaskar

BiggBoss Non Stop :   గతంలో బిగ్‌బాస్‌ అంటే ఓ క్రేజ్ ఉండేది. టీవిలో దానికి మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చేది. తెలుగులో ఇప్పటికే అయిదు సీజన్లు పూర్తి చేసుకుంది. కానీ ఈ సారి టెలివిజన్ నుంచి ఓటీటీకి షిఫ్ట్ అయి బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ పేరుతో టెలికాస్ట్ అవుతుంది. దీంతో ఈ సారి బిగ్‌బాస్‌ కి అనుకున్నంత క్రేజ్ రావడంలేదు. ఇక దీనికి హైప్ తీసుకురావడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. ఇందులో భాగంగానే వైల్డ్ కార్డు ఎంట్రీని తీసుకొచ్చారు.

 

17 మందితో ప్రారంభమై ఇప్పుడు ఏడు వారాలు పూర్తి చేసుకొని ఏడుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. శ్రీరాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వి, ముమైత్‌ ఖాన్‌, స్రవంతి, మహేష్ విట్టా ఇప్పటి వరకు ఎలిమినేట్‌ అయ్యారు. ప్రస్తుతం 10 మంది ఉండగా మళ్ళీ బాబా భాస్కర్ రావడంతో హౌస్ లో 11 మంది అయ్యారు. ఈ సారి బిగ్‌బాస్‌ లో గొడవలు, తిట్టుకోవడాలు, ఆ టాస్కులు తప్ప స్పెషల్ గా ఏమి లేవు, ఎంటర్టైన్మెంట్, కామెడీ అస్సలు లేదు. దీంతో షోలో కామెడీ కోసమైనా ఒకర్ని తీసుకురావాలని, ఎంటర్టైన్మెంట్ డోసు పెంచాలని భావించి ఈ వైల్డ్ కార్డు ద్వారా బాబా భాస్కర్ ని తీసుకొచ్చారు.

BiggBoss Non Stop : బిగ్‌బాస్‌ నుంచి మహేష్ విట్టా అవుట్..

ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ తన డ్యాన్స్ తోనే కాక తన యాక్టింగ్ తో, కామెడీతో అందర్నీ నవ్విస్తూ ఉంటారు. తను ఎక్కడ ఉన్నా హడావిడి చేస్తూ సరదాగా ఉంటారు. దీంతో బాబా భాస్కర్ ని వైల్డ్ కార్డు ద్వారా బిగ్‌బాస్‌ లోకి తీసుకొచ్చారు. ఎప్పటిలాగే బాబా భాస్కర్ మాస్టర్ ఫుల్ ఎనర్జీతో ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ తర్వాత బాబా భాస్కర్ మాట్లాడుతూ.. ” మళ్ళీ నా ఇంటికి వచ్చేసాను. కానీ లోపల ఏం చేస్తారో చూడాలి” అంటూ సరదాగా మాట్లాడారు. మరి బాబా భాస్కర్ ఎంట్రీతో అయినా ఈ సారి బిగ్‌బాస్‌ ఫేట్ ఏమైనా మారుతుందో చూడాలి.