Babai Hotel : మదీనా గూడలో ‘బాబాయ్ హోటల్‌ ’ కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించిన హీరో అశోక్ గల్లా, మిస్ ఇండియా మానస వారణాసి..

విజయవాడలోని బాబాయ్ హోటల్‌కు ఉన్న విశిష్ణత గురించి అందరికీ తెలిసిందే. బాబాయ్ హోటల్‌ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. తాజాగా..

Babai Hotel madinaguda branch opened by ashok galla Manasa Varanasi

Babai Hotel : రుచికరమైన ఆహారం కోసం మనుషులంతా వెతుకుతుంటారు. శుచి, శుభ్రత పాటిస్తూ రుచికరమైన భోజనం అందించే రెస్టారెంట్లు, హోటళ్లు అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిలో బాబాయ్ హోటల్ ముందుంటుంది. విజయవాడలోని బాబాయ్ హోటల్‌కు ఉన్న విశిష్ణత గురించి అందరికీ తెలిసిందే. బాబాయ్ హోటల్‌ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. అంతకంతకూ బ్రాంచ్‌లు పెంచుకుంటూ వెళ్తోన్న బాబాయ్ హోటల్ ఇప్పుడు మదీనా గూడకు వచ్చింది. బాబాయ్ హోటల్ మదీనా గూడ బ్రాంచ్‌ను యంగ్ హీరో అశోక్ గల్లా, మిస్ ఇండియా మానస వారణాసి ప్రారంభించారు.

Pawan Kalyan : పవన్ బర్త్ డేకి రెడీ అవుతున్న గిఫ్ట్స్.. ఏ సినిమా నుంచి ఏ అప్డేట్..?

మహేష్ బాబు మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన అశోక్ గల్లా తన మొదటి చిత్రం ‘హీరో’తో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఇక 2020లో మిస్ ఇండియాగా ఎంపికైన మానస వారణాసి ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మానస, అశోక్ గల్లా కలిసి నటిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి మదీనా గూడలోని బాబాయ్ హోటల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈ జంట సందడి చేసింది. వీరితో పాటుగా మరి కొంత సినీ ప్రముఖులు కార్యక్రమానికి విచ్చేశారు.

Shah Rukh vs Sameer : షారుఖ్ ఖాన్ డైలాగ్‌కి.. ఇన్‌డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన సమీర్ వాంఖడే..

గత ఎనిమిది దశాబ్దాలుగా బాబాయ్ హోటల్ ఎంతో నాణ్యతతో భోజనాన్ని అందిస్తూ వస్తోంది. భోజన ప్రియులకు బాబాయ్ హోటల్ అనేది ఓ అడ్డాలా మారిపోయింది. బాబాయ్ హోటల్‌ను మదీనాగూడలో ప్రారంభించిన అశోక్ గల్లా, మానసలు యాజమాన్యమైన దినేష్, శ్రేష్టకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

Babai Hotel madinaguda branch opened by ashok galla Manasa Varanasi