Shah Rukh vs Sameer : షారుఖ్ ఖాన్ డైలాగ్‌కి.. ఇన్‌డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన సమీర్ వాంఖడే..

జవాన్ లో షారుఖ్ ఖాన్ చెప్పిన డైలాగ్‌కి సమీర్ వాంఖడే ఇన్‌డైరెక్ట్ కౌంటర్ ఇస్తూ ఒక ఇంగ్లీష్ కోట్ ని షేర్ చేశాడు.

Shah Rukh vs Sameer : షారుఖ్ ఖాన్ డైలాగ్‌కి.. ఇన్‌డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన సమీర్ వాంఖడే..

Sameer Wankhede counter for Shah Rukh Khan Jawan Dialogue

Updated On : September 1, 2023 / 2:42 PM IST

Shah Rukh Khan vs Sameer Wankhede : షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ (Jawan) సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ ట్రైలర్ లో షారుఖ్ చెప్పిన ఒక డైలాగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. “నా కొడుకు మీద చెయ్యి వేసే ముందు. వాడి బాబు మీద చెయ్యి వెయ్యి” అని షారుఖ్ చెప్పిన డైలాగ్.. మాజీ యాంటీ డ్రగ్స్ అధికారి సమీర్ వాంఖడేకి ఇచ్చిన మెసేజ్ అంటూ అభిమానులు నెటిజెన్స్ ఆ డైలాగ్ ని వైరల్ చేశారు. ఇక ఈ విషయం సమీర్ వాంఖడే వరకు చేరినట్లు ఉంది.

Jailer : జైలర్ సక్సెస్‌తో ఖుషీ అయిన నిర్మాత.. రజినీకి చెక్‌తో పాటు BMW కారుని..

తాజాగా ఆయన తన సోషల్ మీడియాలో ఒక ఇంగ్లీష్ కోట్ (Quote) ని షేర్ చేశాడు. “నేను నిప్పుని తాకను. నేను మండుతూనే బూడిదలో డాన్స్ చేశాను. నరకం గురించి నాకు ఏ భయం లేదు” అనే కోట్ ని షేర్ చేశాడు. షారుఖ్ ఖాన్ కి ఇన్‌డైరెక్ట్ కౌంటర్ ఇస్తూ సమీర్ వాంఖడే ఈ కోట్ షేర్ చేశాడంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక షారుఖ్ అభిమానులు ఈ కామెంట్స్ లో సమీర్ వాంఖడేని ఉద్దేశిస్తూ.. ‘మీరు తాకిన నిప్పు షారుఖ్’ అంటూ ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Varun – Lavanya : జిమ్‌లో వరుణ్, లావణ్య వర్క్ అవుట్స్.. పిక్ వైరల్!

కాగా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) డ్రగ్స్ విషయంలో జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఆర్యన్ ఖాన్‌ ని అరెస్ట్ చేసిన మాజీ యాంటీ డ్రగ్స్ అధికారే సమీర్ వాంఖడే. ఇక జవాన్ విషయానికి వస్తే.. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో షారుఖ్ తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తుంటే విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నాడు. దీపికా పదుకొనె అతిథి పాత్రలో కనిపించబోతుంది. సెప్టెంబర్ 7న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.