జోరుగా హుషారుగా మూవీ రివ్యూ.. ‘బేబీ’ సినిమా విరాజ్ అశ్విన్ హీరోగా మెప్పించాడా?

 బేబీ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విరాజ్ అశ్విన్(Viraj Ashwin) హీరోగా, తెలుగమ్మాయి పూజిత పొన్నాడ(Pujita Ponnada) హీరోయిన్ గా అను ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'జోరుగా హుషారుగా'.

Baby Movie Fame Viraj Ashwin Joruga Husharuga Movie Review and Rating

Joruga Husharuga Review : బేబీ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విరాజ్ అశ్విన్(Viraj Ashwin) హీరోగా, తెలుగమ్మాయి పూజిత పొన్నాడ(Pujita Ponnada) హీరోయిన్ గా సిరి హనుమంత్, మధునందన్, సాయి కుమార్, రాజేష్ ఖన్నా, సోను ఠాకూర్, రోహిణి, బ్రహ్మాజీ.. ముఖ్యపాత్రల్లో కొత్త దర్శకుడు అను ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘జోరుగా హుషారుగా’. నేడు డిసెంబర్ 15న ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది.

కథ విషయానికొస్తే..
సంతోష్(విరాజ్ అశ్విన్) ఆనంద్(మధునందన్) ఆఫీస్ లో పని చేస్తుంటాడు. సంతోష్ లవర్ నిత్య(పూజిత పొన్నాడ) అతనికి చెప్పకుండా అతని ఆఫీస్ లో టీంలీడ్ గా జాయిన్ అవుతుంది. దీంతో సంతోష్ షాక్ అయి తమ లవ్ గురించి ఆఫీస్ లో ఎవ్వరికి తెలియకూడదు, తెలిస్తే జాబ్స్ తీసేస్తారు అని చెప్తాడు. ఆనంద్ పెళ్లి కావట్లేదని బాధపడుతూ ఉంటాడు. ఆఫీస్ లో సుచిత్ర(సిరి హనుమంత్) ఆనంద్ ని ఇష్టపడుతుంది. వీళ్ళిద్దర్నీ కలిపితే బాస్ మెచ్చుకొని తనకి కావాల్సిన శాలరీ హైక్ ఇస్తాడని ఆనంద్, సుచిత్రని కలపడానికి సంతోష్ ట్రై చేస్తాడు. కానీ ఆనంద్ తప్పుగా అర్ధం చేసుకొని సంతోష్ లవర్ నిత్యని ప్రేమిస్తాడు. మరో పక్క ఊళ్ళో చేనేత కార్మికుడిగా ఉన్న సంతోష్ తండ్రి(సాయి కుమార్) 20 లక్షలు అప్పు చేస్తే ఆ అప్పు కొడుకు కడతాడని ఎదురు చూస్తూ ఉంటాడు. మరి సంతోష్ తండ్రి అప్పు తీర్చాడా? సంతోష్ – నిత్యల ప్రేమ కథ ఏమైంది? సుచిత్ర లవ్ ఆనంద్ కి చెప్పిందా? సంతోష్ – నిత్యల ప్రేమ కథ ఆఫీస్ లో తెలిసిందా? తెలియాలి అంటే మిగిలిన కథ తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
మొదటి హాఫ్ అంతా ఆఫీస్ లో విరాజ్ – పూజిత మధ్య లవ్ సీన్స్, ఆఫీస్ లో కొన్ని కామెడీ సీన్స్, హీరో హీరోయిన్స్ లవ్ ఎవ్వరికి తెలియకూడదు అని సాగుతుంది. మధ్యలో విరాజ్ తల్లితండ్రులుగా సాయి కుమార్ – రోహిణి సీన్స్ చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోర్ కొడుతుంది. ఇంటర్వెల్ కి మధునందన్ సుచిత్రని ప్రేమిస్తాడు అనుకుంటే నిత్యని ప్రేమిస్తాడు అని చెప్పి ఓ కన్ఫ్యూజన్ లో ట్విస్ట్ తో బ్రేక్ ఇస్తారు. ఇక సెకండ్ హాఫ్ అంతా హీరో వాళ్ళిద్దర్నీ కలపడానికి ట్రై చేయడం, వీళ్ళ లవ్ గురించి చెప్పకపోవడంతో హీరో – హీరోయిన్స్ మధ్య మనస్పర్థలు, ఊళ్ళో తండ్రీకొడుకుల ఎమోషన్ చూపిస్తారు. చివరి అరగంట మాత్రం కొంచెం కామెడీతో నవ్వుకోవచ్చు. కొంచెం ఎమోషన్ కూడా వర్కౌట్ అవుతుంది.

నటీనటుల విషయానికొస్తే..
విరాజ్ అశ్విన్ నటనాపరంగా బాగా చేసినా డ్యాన్సుల్లో ఇంకొంచెం కష్టపడాలి. డ్యాన్సుల్లో ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ఇక పూజిత పొన్నాడ నటనతో, అందంతో మెప్పిస్తుంది. సోను ఠాకూర్ తన అందంతో కాసేపు మెరిపిస్తుంది. ఆఫీస్ లో బాస్ గా మధునందన్, విరాజ్ ఫ్రెండ్ గా రాజేష్ ఖన్నా, చివర్లో బ్రహ్మాజీ ప్రేక్షకులని నవ్విస్తారు. సిరి హనుమంత్ అమాయకమైన అమ్మయి పాత్రలో బాగా చేసింది. సాయి కుమార్ – రోహిణి పాత్రలు కాసేపే కనిపించిన ఎమోషన్ తో మెప్పిస్తాయి.

Also Read :  ‘హ్యాపీ బర్త్ డే బేబీ’ అంటూ లావణ్యకు వరుణ్ బర్త్ డే విషెస్

టెక్నికల్ అంశాల విషయానికొస్తే..
కెమెరా విజువల్స్ మాత్రం బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించినా సాంగ్స్ మాత్రం యావరేజ్ అనిపిస్తాయి. కథ పరంగా ఇంట్రెస్ట్ గా ఉన్నా దర్శకుడు స్క్రీన్ ప్లేని ఇంకొద్దిగా బాగా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది.

మొత్తంగా జోరుగా హుషారుగా సినిమా.. ఓ ప్రేమకథకు అదనంగా ఫాదర్ సెంటిమెంట్ జోడించి కొంచెం కన్ఫ్యూజన్ తో నవ్వించి మెప్పించడానికి ట్రై చేశారు.

ట్రెండింగ్ వార్తలు