Varuj Tej : ‘హ్యాపీ బర్త్ డే బేబీ’ అంటూ లావణ్యకు వరుణ్ బర్త్ డే విషెస్

హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. 'హ్యాపీ బర్త్ డే బేబీ' .. అంటూ వరుణ్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Varuj Tej : ‘హ్యాపీ బర్త్ డే బేబీ’ అంటూ లావణ్యకు వరుణ్ బర్త్ డే విషెస్

Varuj Tej

Updated On : December 15, 2023 / 1:47 PM IST

Varuj Tej : మెగా హీరో వరుణ్ తేజ్ తన భార్య నటి లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెప్పారు. వరుణ్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Unstoppable with NBK : అన్‌స్టాపబుల్ నెక్ట్స్ ఎపిసోడ్ ప్రోమో చూసారా?

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నవంబర్ 1 న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో ఎంతో వేడుకగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఆర్కిటిక్ కి హనీమూన్ ట్రిప్ వెళ్లారు. హనీమూన్ ట్రిప్ నుండి ఫోటోలు షేర్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు. ఇక హనీమూన్ ట్రిప్ కూడా పూర్తి కావడంతో వరుణ్ ప్రొఫెషనల్ లైఫ్ లోకి వచ్చేస్తూ ‘మట్కా’ సినిమా షూటింగ్‍లో బిజీ కాబోతున్నారు. ఇదిలా ఉంచితే వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టి తన ప్రేమను వ్యక్తం చేశారు.

Varun Tej : హనీమూన్ కంప్లీట్.. ప్రొఫెషనల్ లైఫ్‌లోకి వచ్చేసిన మెగా హీరో

వరుణ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వివాహ వేడుకల సందర్భంలో లావణ్యతో దిగిన ఫోటోను షేర్ చేసారు. ‘హ్యాపీ బర్త్ డే బేబీ.. నా జీవితంలో వెలుగులు నింపినందుకు థ్యాంక్యూ.. లవ్ యూ’ అనే శీర్షికను యాడ్ చేశారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు లావణ్యకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘మట్కా’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాలో నోరా ఫతేహీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)