Varun Tej : హనీమూన్ కంప్లీట్.. ప్రొఫెషనల్ లైఫ్‌లోకి వచ్చేసిన మెగా హీరో
హనీమూన్ కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ పర్సనల్ లైఫ్‌కి బ్రేక్ ఇచ్చారు. ప్రొఫెషనల్ లైఫ్‌లోకి వచ్చేసి 'మట్కా' మూవీ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

Varun Tej
Varun Tej : ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన టాలీవుడ్ కపుల్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఆర్కిటిక్‌లో హనీమూన్ ఎంజాయ్ చేశారు. ఇక పర్సనల్ లైఫ్‌కి బ్రేక్ ఇచ్చి వరుణ్ ‘మట్కా’ సినిమా షూటింగ్ బిజీ కాబోతున్నారు.
Shreyas Talpade : గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన నటుడు
వరుణ్ తేజ్-లావణ్య నవంబర్ 1న ఓ ఇంటివారయ్యారు. ఇటలీలో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి తర్వాత ఆర్కిటిక్ హనీమూన్ చెక్కేసిన ఈ జంట ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక పర్సనల్ లైఫ్‌కి బ్రేక్ ఇచ్చి వరుణ్ ‘మట్కా’ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.
మొన్నటి దాకా మట్కా సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. మేకర్స్ ఏం చేశారో? ఏమో? మొత్తానికి మట్కా షూటింగ్ మొదలైంది. 1958-1982 మధ్య జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వరుణ్ నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాలో నోరా ఫతేహీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
Year End Roundup 2023 : ఫ్యాన్స్‌కు నిరాశ.. 2023లో థియేటర్లలో కనపడని తెలుగు హీరోలు
ఈ ఏడాది వరుణ్ నటించిన మూవీ ‘గాంఢీవధారి అర్జున’ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత వరుణ్ నటించిన ‘ఆపరేషన్ వాలంటైన్’ 2024 ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది. ఆ తర్వాత ‘మట్కా’ రిలీజ్ కానుంది. మొత్తానికి వరుణ్ 2024 కోసం రెండు ప్రాజెక్టులతో రెడీ అవుతున్నారు.
The much-anticipated shoot of Mega Prince @IAmVarunTej‘s #MATKA began today❤️?
A Massive set has been erected on the outskirts of Hyderabad to shoot some crucial scenes?
More Updates soon!@KKfilmmaker #Norafatehi @Meenakshiioffl @gvprakash @drteegala9 @mohan8998 @VyraEnts pic.twitter.com/Qm8ohQn7nT
— Vyra Entertainments (@VyraEnts) December 14, 2023