Shreyas Talpade : గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన నటుడు
ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

Shreyas Talpade
Shreyas Talpade : ప్రముఖ బాలీవుడు నటుడు శ్రేయాస్ తల్పాడే గుండెపోటుకు గురయ్యారు. ముంబయిలో షూటింగ్‌లో పాల్గొన్న అనంతరం శ్రేయాస్ కుప్పకూలిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రేయాస్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
Year End Roundup 2023 : చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. నింగికెగసిన ప్రముఖ సినీ తారలు
నటుడు శ్రేయాస్ తల్పాడే (47) ముంబయిలో గుండెపోటుకు గురయ్యారు. షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి అసౌకర్యానికి గురైన ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే అంధేరి వెస్ట్ లోని బెల్లేవ్ ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
Year End Roundup 2023: బ్యాచ్‌లర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పి ఓ ఇంటివారైన సినీ తారలు
శ్రేయాస్ ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీ ‘వెల్కమ్ టు జంగిల్’ షూటింగ్ పాల్గొంటున్నారు. శ్రేయాస్ మరాఠీ సీరియల్స్, స్టేజ్ షోల ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఇక్బాల్ సినిమాలోని తన పాత్రతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దోర్, అప్నా సప్నా మనీ మనీ, ఓం శాంతి ఓం, వెల్కం టు సజ్జన్ పూర్, గోల్ మాల్ రిటర్న్ వంటి 40 కి పైగా హిందీ, మరాఠీ సినిమాల్లో నటించారు.