Year End Roundup 2023 : చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. నింగికెగసిన ప్రముఖ సినీ తారలు
2023 లో సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు మరణించారు. వీరిలో నటులు, సంగీత దర్శకులు, గాయకులు ఉన్నారు. పలు అనారోగ్య కారణాలతో మరణించిన వారు కొందరైతే.. కొందరు బలవన్మరణానికి పాల్పడ్డారు.
![Year End Roundup 2023 : చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. నింగికెగసిన ప్రముఖ సినీ తారలు Year End Roundup 2023 : చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. నింగికెగసిన ప్రముఖ సినీ తారలు](https://10tv.in/wp-content/uploads/2023/12/New-Project-6-16.jpg)
Year End Roundup 2023
Year End Roundup 2023: 2023 వ సంవత్సరం సినిమా పరిశ్రమకు తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. ఏ ఇండస్ట్రీలో చూసినా సీనియర్ నటులతో పాటు వర్థమాన నటులు కూడా కన్నుమూసారు. ఈ ఏడాది మరణించిన సినీ ప్రముఖులను ఒకసారి గుర్తు చేసుకుందాం.
కె.విశ్వనాథ్ : తెలుగు సినిమాకు ఓ గౌరవాన్ని తెచ్చిన దర్శకులు కళాతపస్వి కె.విశ్వనాథ్ ఫిబ్రవరి 3 న కన్నుమూసారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ 92 వ ఏట ఆయన మరణించారు.
Ranbir Kapoor : యానిమల్ ఆల్ఫా నుంచి ఆదిపురుషుడిగా.. రణబీర్ రామాయణం వివరాలు..
జమున : సీనియర్ నటి జమున (86) వ ఏట జనవరి 27 న మరణించారు. నటిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన జమునను వెండితెర సత్యభామగా పిలుచుకుంటారు. వయోభారంతో జమున కన్నుమూసారు.
వాణీ జయరామ్ : గాయని వాణీ జయరామ్ (77) ఫిబ్రవరి 4 న అనారోగ్య కారణాలతో చెన్నైలో కన్నుమూసారు. 5 దశాబ్దాల పాటు తన కెరియర్లో 20 వేలకు పైగా పాటలు పాడిన వాణి జయరామ్ 19 భాషల్లో పాటలు పాడటం విశేషం.
నందమూరి తారకరత్న : ఎంతో భవిష్యత్ ఉన్న నటుడు నందమూరి తారకరత్న (39) ఏట తీవ్ర అనారోగ్యంతో ఫిబ్రవరి 18న కన్నుమూశారు. గుండెపోటుకు గురై బెంగళూరు నారాయణ హృదయాలయలో 23 రోజుల చికిత్స తర్వాత పరిస్థితి విషమించి చనిపోయారు.
Karavali : కన్నడ నుంచి మరో పాన్ ఇండియా సినిమా.. ‘కరావళి’.. గేదె చుట్టూ కథ? మహిషావతారంలో హీరో..
శరత్ బాబు : హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న నటుడు శరత్ బాబు (71) అనారోగ్య కారణాలతో మే 22న మరణించారు. కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.
చంద్రమోహన్ : సీనియర్ నటులు చంద్రమోహన్ (78) తీవ్ర అనారోగ్యంతో నవంబర్ 11 న మరణించారు. సుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూసారు.
రాజ్ : ప్రముఖ సంగీత దర్శకులు రాజ్-కోటిల ద్వయంలో ఒకరైన రాజ్ (68) మే 21 న గుండెపోటుతో చనిపోయారు. చాలాకాలంపాటు వెండితెరపై రాజ్-కోటిలు అద్భుతమై బాణీలు అందించారు. ఇద్దరు విడిపోయాక రాజ్ పెద్దగా కనిపించలేదు.
Divyabharathi : బీచ్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తున్న దివ్యభారతి..
శ్రీనివాస మూర్తి : ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి జనవరి 27 న హార్ట్ ఎటాక్‌తో కన్నుమూసారు. సూర్య, అజిత్, మోహన్ లాల్, విక్రమ్ వంటి ప్రముఖ నటులకు ఆయన డబ్బింగ్ చెప్పారు.
సాగర్ : ప్రముఖ సీనియర్ దర్శకుడు సాగర్ (73) ఫిబ్రవరి 2 న మరణించారు. పలు అనారోగ్య సమస్యలతో ఆయన మరణించారు.
సుధీర్ వర్మ : సెకండ్ హ్యాండ్, కుందనపు బొమ్మ వంటి సినిమాల్లో నటించిన సుధీర్ వర్మ(34) జనవరి 24 న చనిపోయారు. ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న సుధీర్ వర్మ బలవన్మరణానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి.
మనోబాల : ప్రముఖ హాస్య నటులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనోబాల (69) మే 3న మరణించారు. లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆయన కన్నుమూసారు.
Manchu Vishnu : న్యూజిలాండ్‌లో భార్య కోసం దొంగతనం చేసిన మంచు విష్ణు.. ఏం చేశాడంటే..?
మయిల్ సామి : ప్రముఖ తమిళ కమెడియన్ మయిల్ సామి (57) ఫిబ్రవరి 19న అనారోగ్య కారణాలతో కన్నుమూసారు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు మయిల్ సామి మరణం తీరని లోటని చెప్పాలి.
ఆకాంక్ష దుబే : భోజ్ పురి నటి ఆకాంక్ష దుబే (23) చిన్న వయసులో మార్చి 26 న మరణించారు. ఆమెది హత్యా? ఆత్మహత్య? అనే కారణాలు బయటకు రాలేదు.
ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ : హిందీ సీరియల్ నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మే 22 న మరణించారు. 32 సంవత్సరాల వయసులో చనిపోయిన ఆదిత్య మరణానికి గల కారణాలు తెలియలేదు.