Home » Chandra Mohan
2023 లో సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు మరణించారు. వీరిలో నటులు, సంగీత దర్శకులు, గాయకులు ఉన్నారు. పలు అనారోగ్య కారణాలతో మరణించిన వారు కొందరైతే.. కొందరు బలవన్మరణానికి పాల్పడ్డారు.
చంద్రమోహన్ కూతుళ్లు మొదటిసారి ఆయన మరణం తర్వాత సంస్మరణ సభలో మాట్లాడారు. చంద్రమోహన్ కి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
గత రెండు రోజులుగా చంద్రమోహన్ భౌతికకాయాన్ని ఫిలిం నగర్ లోనే ఆయన ఇంటివద్ద పలువురి సందర్శనార్థం ఉంచారు.
సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా నివాళులు ప్రకటిస్తున్నారు.
చంద్రమోహన్ భౌతికకాయాన్ని ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసం వద్దే ఉంచారు. నేడు, రేపు ఆయన నివాసంలోనే చంద్రమోహన్ భౌతికదేహం అభిమానులు, ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం ఉంచనున్నారు.
చంద్రమోహన్ కెరియర్లో ఎంతోమంది హీరోయిన్లతో, హీరోలతో నటించారు. అయితే జయసుధ, రాజేంద్రప్రసాద్ కాంబినేషన్లో ఎక్కువ సినిమాల్లో నటించారు. వీరిద్దరితో ఆయన నటించిన సినిమాలు హిట్ అందుకున్నాయి.
సీనియర్ నటుడు చంద్రమోహన్ నేడు ఉదయం పలు ఆరోగ్య సమస్యలతో మరణించారు. దీంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సమయంలో ఆయన పాత ఫొటోలు వైరల్ గా మారాయి.
'చంద్రమోహన్ పక్కన నటిస్తే వస్తే బాగుండును'.. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న హీరోయిన్లు అప్పట్లో అనుకున్న మాట.. ఇవి ఒట్టి మాటలు కావు.. నిజంగానే అప్పట్లో చంద్రమోహన్ పక్కన నటించిన హీరోయిన్లంతా స్టారో హీరోయిన్లు అయిపోయారు.
హీరోగా పలు సినిమాలతో మెప్పించినా తండ్రి పాత్రలతోనే చంద్ర మోహన్ అందరికి గుర్తున్నారు. తెలుగు సినిమాల్లో తండ్రి పాత్రలు చేయాలంటే ఆయనే చేయాలి అనేంతలా మెప్పించారు.
1966లో హీరోగా రంగుల రాట్నం సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు చంద్రమోహన్. BN రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆ సంవత్సరం ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డు గెలుచుకుంది.