Chandra Mohan : చంద్రమోహన్ మరణం తర్వాత మొదటిసారి మాట్లాడిన కూతుళ్లు.. సంస్మరణ సభలో..

చంద్రమోహన్ కూతుళ్లు మొదటిసారి ఆయన మరణం తర్వాత సంస్మరణ సభలో మాట్లాడారు. చంద్రమోహన్ కి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Chandra Mohan : చంద్రమోహన్ మరణం తర్వాత మొదటిసారి మాట్లాడిన కూతుళ్లు.. సంస్మరణ సభలో..

Chandra Mohan Daughters were emotional at his Condolence Meeting

Updated On : November 24, 2023 / 3:06 PM IST

Chandra Mohan : ఎన్నో సినిమాలతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులని మెప్పించిన నటుడు చంద్రమోహన్ ఇటీవల వయోభారం, పలు ఆరోగ్య సమస్యలతో నవంబర్ 11న మరణించారు. నవంబర్ 13న ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా హైదరాబాద్ లో చంద్రమోహన్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు పలువురు సినీ ప్రముఖులు వచ్చి చంద్రమోహన్ కి నివాళులు అర్పించి, ఆయనతో తమకు ఉన్న అనుభందం గురించి పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా పాల్గొన్నారు. చంద్రమోహన్ కూతుళ్లు మొదటిసారి ఆయన మరణం తర్వాత సంస్మరణ సభలో మాట్లాడారు. చంద్రమోహన్ కి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. మధుర మీనాక్షి సైకాలజిస్ట్ గా అమెరికాలో స్థిరడ్డారు. రెండవ కుమార్తె మాధవి డాక్టర్ గా చెన్నైలో ఉంటున్నారు.

చంద్రమోహన్ సంస్మరణ సభలో పెద్ద కుమార్తె మధుర మీనాక్షి మాట్లాడుతూ.. నాన్న నాకు హార్డ్ వర్క్ నేర్పించారు. ఎవరు మనల్ని విమర్శించినా ఆత్మవిశ్వసం ఉంటే ఏదైనా సాధించొచ్చు అని చెప్పేవారు. నా జీవితంలో నాకు ఉన్న ఒకేఒక్క హీరో మా నాన్న. ఆయన మాతో భౌతికంగా లేకపోయినా మానసికంగా మాతోనే ఉంటారు. మా దృష్టిలో ఆయన ఒక లెజెండ్. అందరి హృదయాల్లో ఆయన ఉంటారు అని ఎమోషనల్ అయ్యారు.

Chandra Mohan Daughters were emotional at his Condolence Meeting

Also Read : Chandra Mohan Family : చంద్ర మోహన్ ఫ్యామిలీ గురించి.. భార్య పెద్ద రచయిత్రి.. పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా?

ఇక చంద్రమోహన్ రెండో కూతురు మాధవి మాట్లాడుతూ.. మా నాన్న నిర్మాతల ఆర్టిస్ట్. ఆయన గురించి తలుచుకునే వాళ్లంతా మాతో ఉన్నారనే భావిస్తాం. ఆయన మరణించాక మాకు ఎంతోమంది ఫోన్స్ చేసి సంతాపం తెలిపారు. ఆయన పాటించిన సిద్ధాంతాలతో ముందుకెళతాం. మా నాన్న కర్మ యోగి. జీవితంలో మాకు ఎలా బతకాలో మా నాన్న నేర్పించారు. ఇక్కడికి ఆయన కోసం వచ్చిన సినిమా కుటుంబ సభ్యులందరికి ధన్యవాదాలు అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు.