Chandra Mohan : నేడే చంద్రమోహన్ అంత్యక్రియలు.. ఎక్కడో తెలుసా?

గత రెండు రోజులుగా చంద్రమోహన్ భౌతికకాయాన్ని ఫిలిం నగర్ లోనే ఆయన ఇంటివద్ద పలువురి సందర్శనార్థం ఉంచారు.

Chandra Mohan : నేడే చంద్రమోహన్ అంత్యక్రియలు.. ఎక్కడో తెలుసా?

Chandra Mohan Funeral will Happening Today

Updated On : November 13, 2023 / 9:39 AM IST

Chandra Mohan : తెలుగు, తమిళ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించిన నటుడు చంద్రమోహన్. వయోభారంతో గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్ ఇటీవల గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే నవంబర్ 11న ఉదయం 9.45 గంటలకు మరణించారు.

చంద్రమోహన్ మరణంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. కొంతమంది ప్రముఖులు ఆయన ఇంటివద్దకు వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. గత రెండు రోజులుగా చంద్రమోహన్ భౌతికకాయాన్ని ఫిలిం నగర్ లోనే ఆయన ఇంటివద్ద పలువురి సందర్శనార్థం ఉంచారు.

Also Read : Chandra Mohan : చంద్రమోహన్ ఎలా చనిపోయారు? వాళ్ళు వచ్చాకే అంత్యక్రియలు..

చంద్రమోహన్ కి ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు మధుర మీనాక్షి అమెరికాలో ఉండటంతో ఆమె వచ్చేవరకు అంత్యక్రియలు ఆపారు. నేడు ఆవిడ హైదరాబాద్ కి రానుండటంతో ఇవాళ మధ్యాహ్నం చంద్రమోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి. హైదరాబాద్ పంజాగుట్ట స్మశానంలో చంద్రమోహన్ అంత్యక్రియలు మధ్యాహ్నం తర్వాత జరగనున్నట్టు సమాచారం. ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనకు కొడుకులు లేకపోవడంతో ఎవరి చేతుల మీదుగా ఈ అంత్యక్రియలు జరిపిస్తారారో అని చర్చించుకుంటున్నారు.