Chandra Mohan Awards : చంద్ర మోహన్ అవార్డులు, రివార్డులు.. మొదటి సినిమాకే నంది అవార్డు..

1966లో హీరోగా రంగుల రాట్నం సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు చంద్రమోహన్. BN రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆ సంవత్సరం ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డు గెలుచుకుంది.

Chandra Mohan Awards : చంద్ర మోహన్ అవార్డులు, రివార్డులు.. మొదటి సినిమాకే నంది అవార్డు..

Chandra Mohan Awards and Rewards Full Details

Updated On : November 11, 2023 / 11:51 AM IST

Chandra Mohan Awards : తెలుగు, తమిళ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించిన నటుడు చంద్రమోహన్. వయో భారంతో గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల గుండెకి సంబంధించి ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరగా నేడు నవంబర్ 11న ఉదయం 9.45 గంటలకు మరణించారు చంద్ర మోహన్. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ నివాళులు ప్రకటిస్తున్నారు.

1966లో హీరోగా రంగుల రాట్నం సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు చంద్రమోహన్. BN రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆ సంవత్సరం ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత చంద్ర మోహన్ బెస్ట్ కమెడియన్ గా చందమామ రావే సినిమాకు 1987లో నంది అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత బెస్ట్ సహాయ నటుడిగా 2005లో వచ్చిన కళ్యాణ్ రామ్ అతనొక్కడే సినిమాకు నంది అవార్డు గెలుచుకున్నారు.

Also Read : Chandra Mohan : తల్లి చనిపోయినా షూటింగ్ పూర్తిచేసి మరీ వెళ్లిన చంద్ర మోహన్..

1978లో వచ్చిన పదహారేళ్ళ వయసు సినిమాకు బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. ఇక లోకల్ సంస్థల అవార్డులకైతే లెక్కేలేదు. తన పాత్రలతో మెప్పించి అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు చంద్రమోహన్. సినీ పరిశ్రమకు దూరమయ్యాక కూడా కొన్ని సంస్థలు చంద్రమోహన్ ని పిలిచి అవార్డులతో సత్కరించాయి.