Chandra Mohan : తల్లి చనిపోయినా షూటింగ్ పూర్తిచేసి మరీ వెళ్లిన చంద్ర మోహన్..

చంద్రమోహన్ సినిమాల మీద, తన వర్క్ మీద ఎంత కమిట్మెంట్ తో ఉంటాడో ఒక్క సంఘటనతో తెలియచేయొచ్చు.

Chandra Mohan : తల్లి చనిపోయినా షూటింగ్ పూర్తిచేసి మరీ వెళ్లిన చంద్ర మోహన్..

Chandra Mohan Commitment to his Work must know about this Incident

Chandra Mohan : తెలుగు, తమిళ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించిన నటుడు చంద్రమోహన్. వయో భారంతో గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల గుండెకి సంబంధించి ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరగా నేడు నవంబర్ 11న ఉదయం 9.45 గంటలకు మరణించారు. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ నివాళులు ప్రకటిస్తున్నారు.

దీంతో అభిమానులు, నెటిజన్లు చంద్ర మోహన్ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుంటున్నారు. చంద్రమోహన్ సినిమాల మీద, తన వర్క్ మీద ఎంత కమిట్మెంట్ తో ఉంటాడో ఒక్క సంఘటనతో తెలియచేయొచ్చు.

Also Read : Chandra Mohan Family : చంద్ర మోహన్ ఫ్యామిలీ గురించి.. భార్య పెద్ద రచయిత్రి.. పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా?

చంద్రమోహన్.. ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే సినిమా చేస్తున్నప్పుడు ఆయన తల్లి మరణించింది. ఆ రోజు షూటింగ్ లో ఉండగా ఈ సంఘటన జరగడంతో ఆయనకు తెలిసినా షూటింగ్ మధ్యలో ఆపేసి వెళ్లడం ఇష్టంలేక, షూటింగ్ పూర్తిచేసి తన తల్లిని చూడటానికి వెళ్లారట చంద్రమోహన్. సినిమా పట్ల, ఆయన పని పట్ల అంత నిబద్ధతగా ఉండేవారని అందరూ చెప్పుకుంటారు. ఈ విషయం గతంలో ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ స్వయంగా తెలియచేశారు.