Chandra Mohan : తెలుగు సినిమాల్లో నాన్న పాత్రలంటే ఆయనే చేయాలి.. ఆ సినిమాలో అయితే జీవించేశారు..

హీరోగా పలు సినిమాలతో మెప్పించినా తండ్రి పాత్రలతోనే చంద్ర మోహన్ అందరికి గుర్తున్నారు. తెలుగు సినిమాల్లో తండ్రి పాత్రలు చేయాలంటే ఆయనే చేయాలి అనేంతలా మెప్పించారు.

Chandra Mohan : తెలుగు సినిమాల్లో నాన్న పాత్రలంటే ఆయనే చేయాలి.. ఆ సినిమాలో అయితే జీవించేశారు..

Chandra Mohan Impressed Telugu Audience with his Father Characters

Updated On : November 11, 2023 / 12:14 PM IST

Chandra Mohan : తెలుగు, తమిళ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించిన నటుడు చంద్రమోహన్. వయో భారంతో గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల గుండెకి సంబంధించి ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరగా నేడు నవంబర్ 11న ఉదయం 9.45 గంటలకు మరణించారు చంద్ర మోహన్. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ నివాళులు ప్రకటిస్తున్నారు.

హీరోగా, సెకండ్ హీరోగా కెరీర్ లో పలు సినిమాలు చేసి మెప్పించిన చంద్రమోహన్ ఆ తర్వాత సహాయనటుడిగా, కమెడియన్ గా కూడా చేశారు. అనంతరం సహాయ నటుడిగా తండ్రి పాత్రల్లో ఎక్కువగా మెప్పించారు. సీనియర్ నటి సుధతో కలిసి అనేక సినిమాల్లో హీరోయిన్, హీరోలకు తండ్రి పాత్రల్లో నటించారు.

గులాబీ, నిన్నే పెళ్లాడతా, చంద్రలేఖ, తమ్ముడు, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చవు, మన్మధుడు, నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, ఒక్కడు, వసంతం, 7G బృందావన కాలనీ, మనసంతా నువ్వే, అతనొక్కడే, ఢీ, బలాదూర్, చింతకాయల రవి, రెడీ, డార్లింగ్, మిరపకాయ్, గౌతమ్ నంద.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోలకు, హీరోయిన్స్ కి తండ్రి పాత్రల్లో మెప్పించారు. ఎమోషనల్ గా ప్రేక్షకులని ఏడిపించారు.

తండ్రి పాత్రల్లో చంద్రమోహన్ కి చెప్పుకోవడానికి చాలా పాత్రలు ఉన్నా ఒక్క సినిమా మాత్రం లైఫ్ లాంగ్ గుర్తించుకునేలా చేసి మెప్పించారు. అదే.. 7G బృందావన కాలనీ సినిమాలో హీరోకి తండ్రిగా నటించారు. ఓ మిడిల్ క్లాస్ ఫాదర్ గా, కొడుకు సరిగ్గా చదువుకోక, చెప్పిన మాట వినక తిరుగుతుంటే కొడుకుని తిట్టి, కొట్టే పాత్రలో చంద్రమోహన్ మెప్పించారు. ఈ సినిమాలో తండ్రి పాత్రలో జీవించేశారని చెప్పొచ్చు. కొడుకు గురించి గొప్పగా చెప్పే ఎమోషనల్ సీన్ లో కన్నీళ్లు పెట్టించారు. ఈ క్యారెక్టర్ బాగా క్లిక్ అయి ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే ఇలాగే ఉంటాడేమో అనేలా చేశారు. ఈ సినిమా ఇటీవల రీ రిలీజ్ అయినప్పుడు కూడా చంద్రమోహన్ పాత్ర గురించి అంతా మాట్లాడుకున్నారు.

Also Read : Chandra Mohan Awards : చంద్ర మోహన్ అవార్డులు, రివార్డులు.. మొదటి సినిమాకే నంది అవార్డు..

7G బృందావన కాలనీ సినిమా తెలుగు – తమిళ్ లో తెరకెక్కింది. తమిళ్ లో హీరో ఫాదర్ క్యారెక్టర్ విజయన్ అనే నటుడు చేశారు. ఆయన పాత్ర కంటే కూడా చంద్ర మోహన్ పాత్ర బాగా క్లిక్ అయింది అని ఆ చిత్రయూనిట్ స్వయంగా చెప్పారు. హీరోగా పలు సినిమాలతో మెప్పించినా తండ్రి పాత్రలతోనే చంద్ర మోహన్ అందరికి గుర్తున్నారు. తెలుగు సినిమాల్లో తండ్రి పాత్రలు చేయాలంటే ఆయనే చేయాలి అనేంతలా మెప్పించారు.