Year End Roundup 2023 : చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. నింగికెగసిన ప్రముఖ సినీ తారలు

2023 లో సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు మరణించారు. వీరిలో నటులు, సంగీత దర్శకులు, గాయకులు ఉన్నారు. పలు అనారోగ్య కారణాలతో మరణించిన వారు కొందరైతే.. కొందరు బలవన్మరణానికి పాల్పడ్డారు.

Year End Roundup 2023

Year End Roundup 2023: 2023 వ సంవత్సరం సినిమా పరిశ్రమకు తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. ఏ ఇండస్ట్రీలో చూసినా సీనియర్ నటులతో పాటు వర్థమాన నటులు కూడా కన్నుమూసారు. ఈ ఏడాది మరణించిన సినీ ప్రముఖులను ఒకసారి గుర్తు చేసుకుందాం.

కె.విశ్వనాథ్ : తెలుగు సినిమాకు ఓ గౌరవాన్ని తెచ్చిన దర్శకులు కళాతపస్వి కె.విశ్వనాథ్ ఫిబ్రవరి 3 న కన్నుమూసారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ 92 వ ఏట ఆయన మరణించారు.

Ranbir Kapoor : యానిమల్ ఆల్ఫా నుంచి ఆదిపురుషుడిగా.. రణబీర్ రామాయణం వివరాలు..

జమున : సీనియర్ నటి జమున (86) వ ఏట జనవరి 27 న మరణించారు. నటిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన జమునను వెండితెర సత్యభామగా పిలుచుకుంటారు. వయోభారంతో జమున కన్నుమూసారు.

వాణీ జయరామ్ : గాయని వాణీ జయరామ్ (77) ఫిబ్రవరి 4 న అనారోగ్య కారణాలతో చెన్నైలో కన్నుమూసారు. 5 దశాబ్దాల పాటు తన కెరియర్‌లో 20 వేలకు పైగా పాటలు పాడిన వాణి జయరామ్ 19 భాషల్లో పాటలు పాడటం విశేషం.

నందమూరి తారకరత్న : ఎంతో భవిష్యత్ ఉన్న నటుడు నందమూరి తారకరత్న (39) ఏట తీవ్ర అనారోగ్యంతో ఫిబ్రవరి 18న కన్నుమూశారు. గుండెపోటుకు గురై బెంగళూరు నారాయణ హృదయాలయలో 23 రోజుల చికిత్స తర్వాత పరిస్థితి విషమించి చనిపోయారు.

Karavali : కన్నడ నుంచి మరో పాన్ ఇండియా సినిమా.. ‘కరావళి’.. గేదె చుట్టూ కథ? మహిషావతారంలో హీరో..

శరత్ బాబు :  హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న నటుడు శరత్ బాబు (71) అనారోగ్య కారణాలతో మే 22న మరణించారు.  కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.

చంద్రమోహన్ :  సీనియర్ నటులు చంద్రమోహన్ (78) తీవ్ర అనారోగ్యంతో నవంబర్ 11 న మరణించారు. సుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూసారు.

రాజ్ : ప్రముఖ సంగీత దర్శకులు రాజ్-కోటిల ద్వయంలో ఒకరైన రాజ్ (68) మే 21 న గుండెపోటుతో చనిపోయారు. చాలాకాలంపాటు వెండితెరపై రాజ్-కోటిలు అద్భుతమై బాణీలు అందించారు. ఇద్దరు విడిపోయాక రాజ్ పెద్దగా కనిపించలేదు.

Divyabharathi : బీచ్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తున్న దివ్యభారతి..

శ్రీనివాస మూర్తి : ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి జనవరి 27 న హార్ట్ ఎటాక్‌తో కన్నుమూసారు. సూర్య, అజిత్, మోహన్ లాల్, విక్రమ్ వంటి ప్రముఖ నటులకు ఆయన డబ్బింగ్ చెప్పారు.

సాగర్ : ప్రముఖ సీనియర్ దర్శకుడు సాగర్ (73) ఫిబ్రవరి 2 న మరణించారు. పలు అనారోగ్య సమస్యలతో ఆయన మరణించారు.

సుధీర్ వర్మ : సెకండ్ హ్యాండ్, కుందనపు బొమ్మ వంటి సినిమాల్లో నటించిన సుధీర్ వర్మ(34) జనవరి 24 న చనిపోయారు. ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న సుధీర్ వర్మ బలవన్మరణానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి.

మనోబాల : ప్రముఖ హాస్య నటులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనోబాల (69) మే 3న మరణించారు. లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో  ఆయన కన్నుమూసారు.

Manchu Vishnu : న్యూజిలాండ్‌లో భార్య కోసం దొంగతనం చేసిన మంచు విష్ణు.. ఏం చేశాడంటే..?

మయిల్ సామి : ప్రముఖ తమిళ కమెడియన్ మయిల్ సామి (57) ఫిబ్రవరి 19న అనారోగ్య కారణాలతో కన్నుమూసారు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు మయిల్ సామి మరణం తీరని లోటని చెప్పాలి.

ఆకాంక్ష దుబే : భోజ్ పురి నటి ఆకాంక్ష దుబే (23) చిన్న వయసులో మార్చి 26 న మరణించారు. ఆమెది హత్యా? ఆత్మహత్య? అనే కారణాలు బయటకు రాలేదు.

ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ : హిందీ సీరియల్ నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మే 22 న మరణించారు. 32 సంవత్సరాల వయసులో చనిపోయిన ఆదిత్య మరణానికి గల కారణాలు తెలియలేదు.

 

ట్రెండింగ్ వార్తలు