Year End Roundup 2023 : ఫ్యాన్స్‌కు నిరాశ‌.. 2023లో థియేటర్లలో కనపడని తెలుగు హీరోలు

2023 లో టాలీవుడ్ టాప్ హీరోలు కొందరు థియేటర్లలో సందడి చేయలేదు. వారివి ఒక్క సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ కాలేదు. ఇంతకీ ఎవరా నటులు.. చదవండి.

Year End Roundup 2023 :  ఫ్యాన్స్‌కు నిరాశ‌.. 2023లో థియేటర్లలో కనపడని తెలుగు హీరోలు

Year End Roundup 2023

Year End Roundup 2023 : ఏటా ఏదో ఒక సినిమాతో థియేటర్లను పలకరించే టాప్ హీరోలు కొందరు ఈ ఏడాది సందడి చేయలేదు. వారికి సంబంధించి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీరిలో ఎవరి సినిమా విడుదలకు నోచుకోలేదు. షూటింగ్స్ వాయిదా పడటం కావచ్చు.. మరే ఇతర కారణాలు కావచ్చు ఈ ఏడాది వీరి సినిమాలు విడుదల కాక ఫ్యాన్స్ మాత్రం నిరాశ పడ్డారు.

రామ్ చరణ్ : ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ సినిమా ఎప్పుడా? అని ఎదురుచూసిన అభిమానులకు ఈ ఏడాది నిరాశే ఎదురైంది. ఆచార్యలో గెస్ట్ రోల్‌లో కనిపించిన రామ్ చరణ్ పూర్తిస్ధాయిలో చేసిన ఏ ఒక్క సినిమా థియేటర్లకు రాలేదు. శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ వాయిదా పడుతూ రెండు సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. 2024 లో ఈ సినిమా విడుదల కానుంది.

Year End Roundup 2023 : చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. నింగికెగసిన ప్రముఖ సినీ తారలు

జూనియర్ ఎన్టీఆర్ : RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏ ఒక్కటి థియేటర్లలోకి రాలేదు. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘దేవర’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న దేవర కూడా 2024 లో థియేటర్లలోకి వస్తోంది.

మహేష్ బాబు : మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో ఈ ఏడాది థియేటర్లను పలకరించాల్సి ఉంది. కొన్ని అవాంతరాలతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఈ సినిమా జనవరి 12, 2024 న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తర్వాత మహేష్, రాజమౌళి సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

Year End Roundup 2023: బ్యాచ్‌లర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పి ఓ ఇంటివారైన సినీ తారలు

అల్లు అర్జున్ : బన్నీ పుష్ప ఫస్ట్ పార్ట్ 2021 లో విడుదలైంది. ఈ సినిమాకు ఎక్కడ లేని పేరు వచ్చింది. అంతేకాకుండా అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 మరింత జాగ్రత్తగా తీస్తున్నట్లు తెలుస్తోంది. బన్నీ సినిమా కోసం 2024 వరకు ఎదురుచూడాల్సిందే.

నాగార్జున : ఈ ఏడాది నాగార్జున సినిమా కూడా థియేటర్లకు రాలేదు. చాలా గ్యాప్ తర్వాత నాగార్జున చేస్తున్న సినిమా ‘నా సామిరంగ’ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఈ సినిమా కూడా 2024 సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. అయితే నాగార్జున బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు.

Year End Roundup 2023: భారతీయులు అత్యధికంగా గూగుల్ చేసిన పర్యాటక ప్రాంతాలు ఇవే

వెంకటేష్ : వెంకటేష్ నటించిన ఏ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానప్పటికీ మొదటిసారి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ మాత్రం ఆడియన్స్‌కి తెగ నచ్చేసింది. కానీ ఈ సిరీస్‌లో వెంకటేష్ బోల్డ్ సీన్స్‌లో నటించడం, డైలాగ్స్ చెప్పడం ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చలేదు. అదలా ఉంచితే వెంకటేష్ నటించిన సైంధవ్ రిలీజ్ డేట్ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది.

ఇక శర్వానంద్, రానా వంటి స్టార్ల సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కాలేదు.  ఎటొచ్చి ఈ ఏడాది శర్వానంద్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. వచ్చే ఏడాది అయినా ఈ స్టార్లంతా థియేటర్లలో సందడి చేస్తారని ఆశిద్దాం.