SKN : బేబీ మూవీ నిర్మాత శ్రీనివాస కుమార్ ఇంట విషాదం..

గత ఏడాది 'బేబీ'తో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత శ్రీనివాస కుమార్ అలియాస్ SKN ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Baby Movie Producer Sreenivas Kumar alias SKN father is passed away

SKN : ఇటీవల కాలంలో టాలీవుడ్ బాగా వినిపించిన నిర్మాత పేరు శ్రీనివాస కుమార్ అలియాస్ SKN. గత ఏడాది ‘బేబీ’ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం నిర్మించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొన్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేయడమే కాదు, బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రొఫిషనల్ కెరీర్ లో ఫుల్ హ్యాపీలో ఉన్న ఈ నిర్మాత ఇంట.. ఇప్పుడు తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Also read : Koffee With Karan 8 : డేటింగ్ విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన జాన్వీ కపూర్

ఎస్‌కేఎన్‌ తండ్రి గాదె సూర్య ప్రకాశరావు నేడు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతోనే ఆయన మరణించినట్లు తెలుస్తుంది. ఈరోజు జనవరి 4 సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు.. ఎస్‌కేఎన్‌ కుటుంబానికి తమ సానుభూతుని తెలియజేస్తున్నారు. ఈక్రమంలోనే నిర్మాత నాగవంశీ కూడా సోషల్ మీడియా ద్వారా తన సంతాపం వ్యక్తం చేశారు.