బజ్‌రంగీ భాయ్‌జాన్ ‘మున్నీ’ ఇప్పుడు ఎలా ఉందో చూశారా!

  • Publish Date - November 18, 2020 / 05:55 PM IST

Harshaali Malhotra: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా.. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్‘బజ్‌రంగీ భాయ్‌జాన్’..ఈ చిత్రంలో హర్షాలి మల్‌హోత్రా అనే చైల్డ్ యాక్టర్ ‘మున్నీ’ అనే మూగ బాలిక పాత్రతో బాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రంలో హర్షాలి మూగ బాలిక పాత్రలో లీనమైపోయి నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.


ఇప్పుడు తన టాపిక్ ఎందుకొచ్చిందంటే.. దీపావళి, భాయ్ దూజ్ సందర్భంగా హర్షాలి తన ఫొటోలను ట్విట్టర్, ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు హర్షాలి అప్పుడే అంత పెద్దది అయిపోయిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.


2015 లో ‘బజ్‌రంగీ భాయ్‌జాన్’ రిలీజ్ అప్పటికి హర్షాలి వయసు ఏడు సంవత్సరాలు. అంటే.. ప్రస్తుతం ఆమె వయసు పన్నెండేళ్లు. అయితే హర్షాలి ఫొటోలను చూసిన నెటిజన్లు మాత్రం ఆమె వయసు 12 ఏళ్లు అంటే నమ్మబుద్ధి కావడం లేదంటున్నారు.. మేకప్ వల్లే ఇలా కనిపిస్తున్నావంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. తాను ఇప్పటివరకు ఎప్పుడూ మేకప్ వేసుకోలేదని హర్షాలి చెప్పింది. ఇప్పుడు ఆమె పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.