Balakrishna- Koratala: జనతా గ్యారేజ్ స్టైల్లో ‘కార్పెంటర్’.. సమాజాన్ని సరిదిద్దే మేస్త్రీగా బాలకృష్ణ
కొరటాల శివ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్న నందమూరి బాలకృష్ణ(Balakrishna- Koratala).
- V Santhosh Kumar
- Updated on- May 10, 2026 / 04:02 PM IST
balakrishna and koratala siva movie carpenter
- బాలయ్య, కొరటాల శివ క్రేజీ మూవీ.
- బాలకృష్ణ పవర్‌ఫుల్ కార్పెంటర్ పాత్ర.
- అనిరుధ్ సంగీతం అందిస్తున్న చిత్రం.
Balakrishna- Koratala: నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు కొరటాల శివ కలయికలో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఇటీవల అధికారిక ప్రకటన వెలువడింది. ఈ వార్త తెలియడంతో అటు నందమూరి అభిమానులు, ఇటు నార్మల్ ఆడియన్స్ హ్యాపీ ఫీలయ్యారు. కొరటాల శివ తన సినిమాల్లో బలమైన సామాజిక సందేశాన్ని కమర్షియల్ హంగులతో మిక్స్ చేయడంలో దిట్ట. ఇప్పుడు బాలయ్య వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో సినిమా చేస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి, అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
CM Vijay: తమిళనాడు సీఎంగా విజయ్.. ఫస్ట్ వెయ్యి కోట్ల సినిమా వచ్చేస్తోంది
ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉండబోతోందని తెలుస్తోంది. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ తరహాలోనే, ఈ కథ కూడా సహజత్వానికి దగ్గరగా ఉంటూనే పవర్ ఫుల్ ఎమోషన్స్‌తో సాగుతుందట. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు, బాలయ్య ఈ చిత్రంలో ఒక కార్పెంటర్ (Balakrishna- Koratala)పాత్రలో కనిపించనున్నారు. కేవలం చెక్క సామానును మాత్రమే కాకుండా, దారి తప్పుతున్న సమాజాన్ని కూడా సరిదిద్దడమే తన ధ్యేయంగా పెట్టుకున్న ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఆయన పాత్రను డిజైన్ చేశారట. ఈ కొత్త మేకోవర్ అభిమానులకు కచ్చితంగా సర్ప్రైజ్ ఇస్తుందని చిత్ర బృందం భావిస్తోంది.
మరోవైపు ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ ఫామ్‌లో ఉన్న అనిరుధ్, బాలయ్య సినిమాకు తనదైన శైలిలో అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఇస్తాడని అందరూ భావిస్తున్నారు. పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్, మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. నందమూరి నటసింహం తనదైన శైలిలో గర్జిస్తూ సమాజంలో మార్పు కోసం పోరాడే ఈ కార్పెంటర్ పాత్రలో ఎలా మెప్పిస్తారో అని అందరూ ఎదురుచూస్తున్నారు.
