CM Vijay: తమిళనాడు సీఎంగా విజయ్.. ఫస్ట్ వెయ్యి కోట్ల సినిమా వచ్చేస్తోంది
తమిళనాడు సీఎం విజయ్(CM Vijay) నుంచి వస్తున్న మొదటి వెయ్యి కోట్ల సినిమా ఇదే.
Tamil Nadu CM Vijay First thousand Crore Movie jana nayagan
- సీఎం విజయ్ ఆఖరి చిత్రం ‘జననాయగన్’.
- వెయ్యి కోట్ల వసూళ్లపై ఫ్యాన్స్ ధీమా.
- లీకేజీలు, ఓటీటీ సమస్యల ఆందోళన.
CM Vijay: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు విజయ్. దాంతో, ఆయన అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలోనే ఆయన నటించిన ఆఖరి చిత్రం ‘జననాయగన్’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఏ కోలీవుడ్ హీరోకు సాధ్యం కాని రూ.1000 కోట్ల రూపాయల వసూళ్ల రికార్డును ఈ సినిమాతో విజయ్ సాధిస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలకు సైతం అందని ఈ అరుదైన ఘనతను, ముఖ్యమంత్రి హోదాలో తన రిటైర్మెంట్ మూవీతో విజయ్(CM Vijay) అందుకుంటారని ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి.
Peddi: ‘పెద్ది’ ప్రభంజనం షురూ.. అరగంటలోనే బాక్సాఫీస్ షేక్.. ఇది కదా చరణ్ రేంజ్
అయితే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా గత సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఇటీవల చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలు ఆన్లైన్లో లీక్ కావడం చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిణామాల ప్రభావం సినిమా వ్యాపారంపై కూడా పడింది. లీకేజీ సమస్యలు, ఇతర కారణాల వల్ల ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ తమ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిర్మాతలకు ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన విషయమే అయినా, థియేట్రికల్ రన్ మీద ఉన్న నమ్మకం మాత్రం సడలలేదు.
మరోవైపు సినిమా విడుదల తేదీపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. సెన్సార్ సర్టిఫికెట్ ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యం కారణంగా అధికారిక ప్రకటన వెలువడలేదు. రాజకీయంగా విజయ్ సీఎం పీఠాన్ని అధిష్టించి తన భవిష్యత్తుపై స్పష్టతనిచ్చినప్పటికీ, వెండితెరపై ఆయన చివరి ప్రయాణం ఎప్పుడు మొదలవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అంతా సవ్యంగా జరిగి సినిమా థియేటర్లలోకి వస్తే, ప్రస్తుత క్రేజ్ దృష్ట్యా బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులన్నీ కనుమరుగవ్వడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
