Sir Movie: సార్ మూవీ చిత్ర యూనిట్‌ను అభినందించిన బాలకృష్ణ
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన రీసెంట్ మూవీ ‘సార్’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను ఓ మంచి సందేశంతో చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు.
- Anil Aaleti
- Published on- March 3, 2023 / 08:09 PM IST
Balakrishna Appreciated Sir Movie Unit
Sir Movie: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన రీసెంట్ మూవీ ‘సార్’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను ఓ మంచి సందేశంతో చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఇక ఈ సినిమాలో ధనుష్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. కాగా, ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ సినిమాను నందమూరి నటసింహం బాలకృష్ణ వీక్షించాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీనింగ్‌లో బాలయ్య సార్ చిత్రాన్ని వీక్షించాడు. ఇక సినిమాను చూసిన బాలకృష్ణ, సార్ చిత్ర యూనిట్‌ను అభినందించాడు.
Sir Movie Success Meet : సార్ సినిమా సక్సెస్ మీట్ గ్యాలరీ..
మంచి సందేశంతో తెరకెక్కించిన సినిమాగా ‘సార్’ ప్రేక్షకుల మన్ననలు పొందడం సంతోషంగా ఉందని బాలకృష్ణ అన్నారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీలను ప్రత్యేకంగా అభినందించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక బాలయ్య ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో తన కెరీర్‌లోని 108వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
