Sir Movie Collections : కలెక్షన్స్‌తో ధనుష్ కెరీర్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సార్ సినిమా..
ధనుష్ నటించిన సార్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ నమోదు చేస్తుంది. తాజాగా కర్ణాటక బాక్స్ ఆఫీస్ వద్ద..
Sir Movie Collections : తమిళ హీరో ధనుష్.. సార్ సినిమాతో తెలుగులో మొదటిసారి స్ట్రెయిట్ సినిమా చేశాడు. అంతేకాదు ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకున్నాడు. ఈ సినిమాలో ధనుష్ కాలేజీ లెక్చరర్ గా కనిపించాడు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఫిబ్రవరి 17న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో కలెక్షన్స్ పరంగా దుమ్ము దులుపుతుంది.
Sir Movie Collections : 75 కోట్ల ‘సార్’.. 100 కోట్లకు పరుగు తీస్తున్న ధనుష్ సినిమా..
తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రీమియర్స్ పడడంతో.. ఓపెనింగ్స్ కూడా అదే రేంజ్ లో చూసింది. దీంతో ఈ మూవీ మొదటి మూడు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇక మొదటి వారం పూర్తి అయ్యేసరికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి రికార్డు నమోదు చేసింది. తాజాగా కర్ణాటక బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ చిత్రం రికార్డు వసూళ్లు రాబడుతుంది.
ఇప్పటి వరకు ఈ చిత్రం కన్నడనాట రూ. కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ధనుష్ కెరీర్ లోనే కర్ణాటకలో ఇది హైయెస్ట్ గ్రాసర్. ఇక ఓవర్ సీస్ మార్కెట్ లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ అందుకుంటుంది. యూకే లో 200K డాలర్లు, యూఎస్ఏ లో 400K డాలర్లు అందుకుంది. ఈ కలెక్షన్స్ చూస్తుంటే మరో కొన్నిరోజుల్లో 100 కోట్ల మార్క్ ని అందుకోవడంలో సందేహం లేదంటున్నారు సినిమా పండితులు. కాగా ఈ సినిమా విద్య వ్యవస్థను ప్రశ్నించేలా తెరకెక్కించారు. ప్రైవేట్ రంగంతో చదువు వ్యాపారంగా మారుతుంది అనే మెసేజ్ ని కమర్షియల్ హంగులతో చాలా చక్కగా చూపించాడు దర్శకుడు.
. @dhanushkraja ‘s #Vaathi / #SIR reaching the £ 200K Mark in #UK
— Ramesh Bala (@rameshlaus) March 1, 2023
. @dhanushkraja ‘s #Vaathi / #SIRMovie crosses $400K in USA ??
— Ramesh Bala (@rameshlaus) March 1, 2023
. @dhanushkraja ‘s #Vaathi / #SIRMovie has grossed ₹ 7 Crs at the Karnataka Box office..
Highest for Dhanush..
— Ramesh Bala (@rameshlaus) March 1, 2023