Sir Movie Collections : 75 కోట్ల ‘సార్’.. 100 కోట్లకు పరుగు తీస్తున్న ధనుష్ సినిమా..

సార్ సినిమా మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి రికార్డు కలెక్షన్స్ ని సాధించింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. సార్ సినిమా................

Sir Movie Collections : 75 కోట్ల ‘సార్’.. 100 కోట్లకు పరుగు తీస్తున్న ధనుష్ సినిమా..

Dhanush Sir movie collects 75 crores gross world wide in just one week

Updated On : February 25, 2023 / 2:17 PM IST

Sir Movie Collections :  ధనుష్, సంయుక్త జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై తెరకెక్కిన సినిమా సార్. సాంగ్స్, ట్రైలర్ అభిమానులని, ఆడియన్స్ మెప్పించడంతో ముందునుంచే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 17న సార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజయి మంచి విజయం సాధించింది. మౌత్ టాక్ తో ఈ సినిమా అందరికి చేరువవుతుంది.

ముఖ్యంగా సార్ సినిమా చదువుకు ఉన్న వ్యాల్యూ గురించి చెప్పడం. మంచి మెసేజ్ సినిమాని మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో చూపించడం, ఎలివేషన్స్, ఎమోషనల్ సీన్స్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా మరింత విజయం సాధిస్తుంది. ఇక సార్ సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. సార్ సినిమాకు ఒక రోజు ముందే హైదరాబాద్, చెన్నై, తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ప్రీమియర్ షోలు వేయగా అవన్నీ హౌస్ ఫుల్ అవ్వడం విశేషం.

సార్ సినిమా మొదటి మూడు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. సినిమా మంచి హిట్ అయి కలెక్షన్స్ కూడా వస్తుండటంతో ధనుష్ అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక సార్ సినిమా రిలీజ్ అయి వారం అయింది. సార్ సినిమా మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి రికార్డు కలెక్షన్స్ ని సాధించింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. సార్ సినిమా ఇప్పటికి దాదాపు 40 కోట్ల షేర్ కలెక్షన్స్ ని సాధించినట్టు సమాచారం. దీంతో సార్ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది.

Nani Birthday Celebrations : న్యాచురల్ స్టార్ నాని బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్యాలరీ.. ఎవరెవరు వచ్చారో చూడండి..

75 కోట్లు కలెక్ట్ చేసిన సార్ సినిమా ఇప్పుడు 100 కోట్లకు పరుగులు తీస్తుంది. ధనుష్ గత సినిమా తిరు కూడా లాంగ్ రన్ లో 110 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మంచి విజయం సాధించింది. ఇప్పుడు సార్ సినిమా కూడా త్వరలో 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని, బ్యాక్ టు బ్యాక్ ధనుష్ కి 100 కోట్ల సినిమాలు అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.