Balakrishna as Brand Ambassador for Vega Jewellers and done a ad shoot for it
Balakrishna : బాలకృష్ణ కరోనా తర్వాత ఫుల్ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అఖండ సినిమా భారీ హిట్ అయ్యాక అన్‌స్టాపబుల్ షో సూపర్ హిట్ అవ్వడం, ఆ తర్వాత దానికి సీజన్ 2 కూడా తీయడం, ఇటీవల సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో కూడా మళ్ళీ హిట్ కొట్టడంతో బాలయ్య బాబు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇదే జోష్ లో అన్‌స్టాపబుల్ షో తర్వాత బాలకృష్ణ మొట్టమొదటి సారి ఒక యాడ్ చేశారు.
సినిమా సెలబ్రిటీలు యాడ్స్ చేసి మరిన్ని డబ్బులు సంపాదిస్తారని తెలిసిందే. కానీ కొంత మంది స్టార్లు యాడ్స్ ఎక్కువ డబ్బులు ఇచ్చినా చేయరు. ఇన్నాళ్లు యాడ్స్ చేయని బాలయ్య బాబు ఇటీవల తన బసవతారకం హాస్పిటల్ కు నిధులు ఇవ్వడం కోసం యాడ్ చేశానంటూ ఓ రియల్ ఎస్టేట్ యాడ్ చేశారు. ఆ యాడ్ బాగా వైరల్ గా మారింది. తాజాగా వేగ జువెల్లర్స్ అనే బ్రాండ్ కి మరో యాడ్ చేసి అదే నగల బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు.
Sir Movie : ‘సార్’ సినిమాని పైరసీ చేస్తే ఇలా కంప్లైంట్ చేయండి.. పైరసీని ఎంకరేజ్ చేయకండి..
ఇటీవలే వేగ జువెల్లర్స్ అనే బ్రాండ్ కి బాలయ్య, ప్రగ్య మీద ఓ యాడ్ షూట్ చేసినట్టు సమాచారం. తాజాగా బాలకృష్ణ వేగ జువెల్లర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అంటూ ఓ పోస్టర్ తో అధికారికంగా ప్రకటించారు. బాలయ్య ఈ పోస్టర్ లో సాంప్రదాయ దుస్తులు వేసుకొని మెడలో ఓ పెద్ద హారం వేసుకొని ధగధగ మెరిసిపోతున్నాడు. త్వరలోనే దీనికి షూట్ చేసిన యాడ్ రాబోతుంది. బాలయ్య ఇప్పుడు మరో యాడ్ చేసి ఇంకా జోష్ లో ఉన్నారు. అటు సినిమాల్లోనూ, ఇటు యాడ్స్ తోను కుర్ర హీరోలకి పోటీ ఇస్తున్నారు బాలయ్య బాబు.
GOLDEN UPDATE ⭐#VegaJewellers & #VegaSriGoldAndDiamonds turns more prestigious as God Of Masses #NandamuriBalakrishna joined the Vega Family as a Brand Ambassador ??
Stay Tuned to @shreyasgroup for updates?#NBK@shreyasmedia @BrandeDigital pic.twitter.com/3KELOXvN7A
— Ramesh Bala (@rameshlaus) February 16, 2023