Balakrishna : ఆ రోజు ‘పెద్ది’ కోసం రాబోతున్న బాలయ్య..? మెగా – నందమూరి ఫ్యాన్స్ కి పండగే..
ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో పెద్ది ప్రమోషన్స్ మొదలుపెట్టారు. (Balakrishna)
- Saketh U
- Published on- May 21, 2026 / 07:28 AM IST
Balakrishna Ram Charan
Balakrishna : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న పాన్ ఇండియా వైడ్ ఘనంగా రిలీజ్ కాబోతుంది. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ అయితే తన పర్ఫార్మెన్స్ తో అదరగొడతాడని తెలుస్తుంది. ఇటీవలే ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో ఎనిమిది ఈవెంట్స్ ప్లాన్ చేసారు.
ఈ క్రమంలో జూన్ 2న హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసారు పెద్ది మూవీ యూనిట్. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ గెస్ట్ గా హాజరవుతారని టాలీవుడ్ టాక్. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో పెద్ది సినిమా తెరకెక్కుతుంది. ఇదే నిర్మాణ సంస్థ నెక్స్ట్ బాలయ్య- గోపీచంద్ మలినేని సినిమా నిర్మిస్తుంది. సాధారణంగా ఒక నిర్మాణ సంస్థలో సినిమా రిలిజ్ అవుతుంటే అదే సంస్థలో సినిమా చేస్తున్న వేరే హీరో గెస్టులుగా వచ్చే ఆనవాయితీ ఉంది.
Also Read : Nayanthara : భర్త,పిల్లలతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నయనతార.. క్యూట్ ఫొటోలు..
అంతే కాకుండా ఇటీవల పెద్ది నిర్మాత వెంకట సతీష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇంకా గెస్ట్ ని అనుకోలేదు. బాలయ్య గారిని అడగాలి. ఇంకా ఫైనల్ కాదు అని హింట్ ఇచ్చారు. దీంతో నిర్మాత అడిగితే బాలయ్య కచ్చితంగా పెద్ది ఈవెంట్ కి వస్తారు. అదే కనక జరిగితే ఒకే వేదికపై రామ్ చరణ్ – బాలకృష్ణ కనిపిస్తే మెగా నందమూరి ఫ్యాన్స్ కి పండగే.
