Bhagavanth Kesari : వీరసింహారెడ్డి ఫుల్‌రన్ కలెక్షన్స్‌ని.. భగవంత్ కేసరి పదకొండు రోజుల్లోనే..!

భగవంత్ కేసరి సెంచరీ కొట్టిన తరువాత కూడా దూకుడు మీద ముందుకు వెళ్తుంది. వీరసింహారెడ్డి సినిమా ఫుల్ రన్..

Balakrishna Bhagavanth Kesari Box Office second weekend collections

Bhagavanth Kesari : అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ దసరా కానుకగా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద మోత మోగిస్తూ ముందుకు వెళ్తుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుంటుంది. మొదటి రోజే 33 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమా.. మొదటి వీకెండ్ పూర్తీ చేసుకునేపాటికి రూ.80 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఆ తరువాత ఆరు రోజుల్లోనే రూ.104 కోట్లు కలెక్ట్ చేసి బాలయ్యకి హ్యాట్రిక్ ని అందించింది.

బాలకృష్ణ గత రెండు సినిమాలు అఖండ, వీరసింహారెడ్డి 100 కోట్ల మార్క్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ రెండు చిత్రాలు 100 కోట్ల మార్క్ తరువాత కలెక్షన్స్ రాబట్టడంలో కొంచెం స్లో అయ్యాయి. కానీ భగవంత్ కేసరి సెంచరీ కొట్టిన తరువాత కూడా దూకుడు మీద ముందుకు వెళ్తుంది. వీరసింహారెడ్డి సినిమా ఫుల్ రన్ లో రూ.130 కోట్లకు పైగా గ్రాస్ ని రాబట్టి.. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ ఫుల్‌రన్ కలెక్షన్స్‌ని భగవంత్ కేసరి పదకొండు రోజుల్లోనే అందుకుంది.

Also read : Kaithi 2 : ఖైదీ సీక్వెల్‌లో LCU పాత్రలు అన్ని కనిపించబోతున్నాయి.. లోకేష్ కనగరాజ్

బాక్సాఫీస్ వద్ద సెకండ్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రూ.130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ప్రస్తుతం దగ్గరిలో పెద్ద సినిమా రిలీజ్‌లు ఏమి లేవు. ఏపీలో కూడా ఈ మూవీ కలెక్షన్స్ ప్రస్తుతం జోరు అందుకున్నాయి. బాలయ్య స్పీడ్ చూస్తుంటే.. భగవంత్ కేసరి 150 కోట్ల మార్క్ ని క్రాస్ చేయడం పెద్ద కష్టం కాదని తెలుస్తుంది. సీనియర్ హీరోల్లో ప్రస్తుతం బాలయ్య ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. హిట్టు మీద హిట్టు కొడుతూ దూసుకు పోతున్నాడు. తరువాత చేయబోయే బాబీ సినిమా కోసం భగవంత్ కేసరితో ఎలాంటి బెంచ్ మార్క్ కలెక్షన్స్ ని సెట్ చేస్తాడో చూడాలి.