Balakrishna Family : బాలకృష్ణ ఫ్యామిలీ ఫోటో వైరల్.. ఢిల్లీలో పద్మ భూషణ్ అవార్డు అందుకునే ముందు.. ఫొటోలో ఎవరెవరు ఉన్నారంటే..?
బాలకృష్ణ ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది.
- Saketh U
- Published On : April 28, 2025 / 09:09 PM IST
Balakrishna Family Photo goes Viral from Delhi on Padma Awards Day
Balakrishna Family : నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు పద్మ అవార్డుల ప్రధానం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. బాలకృష్ణ పంచెకట్టుతో తెలుగువాడిగా పద్మ భూషణ్ అవార్డు తీసుకున్నారు. బాలయ్య పద్మ భూషణ్ అవార్డు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ క్రమంలో బాలకృష్ణ ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది. పద్మ భూషణ్ అవార్డు అందుకునే ముందు ఫ్యామిలీతో కలిసి రాష్ట్రపతి భవన్ ముందు ఫోటో దిగారు బాలయ్య. ఈ ఫొటోలో బాలకృష్ణ, భార్య వసుంధర, పెద్ద కూతురు బ్రాహ్మణి, అల్లుడు లోకేష్, మనవడు దేవాన్ష్, చిన్నకూతురు తేజస్విని, అల్లుడు భరత్, కొడుకు మోక్షజ్ఞ ఉన్నారు. ఇలా చాన్నాళ్ల తర్వాత బాలయ్య ఫ్యామిలీ అంతా ఒకే ఫొటోలో ఉండటంతో ఫ్యాన్స్ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.
Also See : Padma Awards 2025: పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. లైవ్
