Padma Awards 2025: పద్మవిభూషణ్ అందుకున్న డా.నాగేశ్వర్ రెడ్డి, పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ.. ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..
వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Padma Awards 2025: ఢిల్లీలో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు అందజేశారు. వైద్య రంగంలో డాక్టర్ దువ్వూర్ నాగేశ్వర్ రెడ్డి పద్మవిభూషణ్ అందుకున్నారు.
కళా రంగంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో మెరిశారు. మందకృష్ణ మాదిగ, నటుడు అజిత్, ఏపీకి చెందిన కేఎల్ క్రిష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు, రాఘవేంద్రాచార్య పద్మ పురస్కారాలు అందుకున్నారు.
Also Read: కిలో బియ్యం రూ.339, డజన్ గుడ్లు రూ.332, కిలో నెయ్యి రూ.3వేలు.. పాకిస్థాన్‌లో భగ్గుమంటున్న ధరలు..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రకటించింది. 139 మందికి ‘పద్మ’ అవార్డులు ప్రకటించింది కేంద్రం. వారిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. అటు కోలీవుడ్ హీరో అజిత్ సైతం పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో హీరో అజిత్ సూట్ లో మెరిశారు.
గాయకుడు అర్జిత్ సింగ్- పద్మశ్రీ
నటుడు నందమూరి బాలకృష్ణ- పద్మభూషణ్
గాయకుడు పంకజ్ ఉధాస్ (మరణానంతరం)- పద్మ భూషణ్
నటుడు అజిత్ కుమార్-పద్మ భూషణ్
చిత్ర నిర్మాత శేఖర్ కపూర్-పద్మ భూషణ్
నటుడు అశోక్ లక్ష్మణ్ సరాఫ్- పద్మశ్రీ
యాక్టింగ్ కోచ్, థియేటర్ డైరెక్టర్ బారీ గాడ్‌ఫ్రే జాన్-పద్మశ్రీ
గాయకుడు జస్పిందర్ నరులా- పద్మశ్రీ
గాయకుడు అశ్విని భిడే దేశ్‌పాండే-పద్మశ్రీ
సంగీత స్వరకర్త రికీ జ్ఞాన్ కేజ్-పద్మశ్రీ
జానపద గాయకుడు భేరు సింగ్ చౌహాన్-పద్మశ్రీ
భక్తి గాయకుడు హర్జిందర్ సింగ్ శ్రీనగర్ వాలే-పద్మశ్రీ
జానపద సంగీత విద్వాంసుడు జోయనాచరణ్ బఠారి-పద్మశ్రీ
క్లాసికల్ సింగర్ కె ఓమనకుట్టి అమ్మ-పద్మశ్రీ
గాయకుడు మహాబీర్ నాయక్ – పద్మశ్రీ
నటి మమతా శంకర్ -పద్మశ్రీ
నటుడు అనంత్ నాగ్- పద్మభూషణ్