Pro Kabaddi : కబడ్డీ కోసం కలిసిన బాలయ్య, టైగర్ ష్రాఫ్, కిచ్చ సుదీప్.. వీడియో అదిరిపోయిందిగా..
ఇప్పుడు కబడ్డీ లీగ్(Kabaddi League) కోసం మూడు సినీ పరిశ్రమల నుంచి ముగ్గురు హీరోలు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు.
- Saketh U
- Published On : November 21, 2023 / 10:36 AM IST
Balakrishna Kichcha Sudeep Tiger Shroff Promoting Pro Kabaddi League Video Goes Viral
Pro Kabaddi : పలువురు స్టార్ హీరోలు యాడ్స్ చేస్తారని తెలిసిందే. ఇటీవల స్పోర్ట్స్ ని కూడా జనాలందరి దగ్గరికి చేరవేయడానికి సినిమా సెలబ్రిటీలతో యాడ్స్ చేయిస్తున్నారు. క్రికెట్ తో పాటి అనేక రకాల గేమ్స్ ఇప్పుడు ప్రీమియర్ లీగ్స్ జరుగుతున్నాయి. క్రికెట్ కి ఎంతోమంది సెలబ్రిటీస్ ప్రచారం చేశారు. కొన్ని రోజుల క్రితం వాలీబాల్ కోసం విజయ్ దేవరకొండ కూడా ప్రచారం చేశాడు.
ఇప్పుడు కబడ్డీ లీగ్(Kabaddi League) కోసం మూడు సినీ పరిశ్రమల నుంచి ముగ్గురు హీరోలు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా బాలకృష్ణ(Balakrishna), కిచ్చ సుదీప్(Kichcha Sudeep), టైగర్ ష్రాఫ్(Tiger Shroff) లతో ప్రో కబడ్డీ లీగ్ కోసం ఒక యాడ్ డిజైన్ చేశారు. తాజాగా ఈ యాడ్ రిలీజ్ అయింది. ఇందులో ముగ్గురు హీరోలు గుర్రాల మీద యోధుల్లాగా వచ్చి కబడ్డీ కోర్టు నిప్పుతో గీసి, అందులో కబడ్డీ ఆడినట్టు పవర్ ఫుల్ గా చూపించారు. చివర్లో బాలయ్య గెలిచి తొడకొట్టినట్టు చూపించారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Also Read : Nandu : గల్లీ క్రికెట్ నుంచి వరల్డ్ కప్ వరకు ప్రయాణం.. యాక్టర్ నందు ఎమోషనల్ పోస్ట్..
ఈ వీడియోని షేర్ చేస్తూ.. కబడ్డీ.. మన మట్టిలో పుట్టిన ఆట. మన తెలుగువాడి పౌరుషాన్ని తెలిపే ఆట. కండల బలమే ఆయుధంగా, మైదానమే రణస్థలంగా, పోరాడే ఈ దమ్మున్న ఆటను అస్సలు మిస్ కావద్దు అంటూ తెలుగులో ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 డిసెంబర్ 2 నుంచి మొదలు కానుంది. 12 టీమ్స్ ఇందులో తలపడనున్నాయి. ఈ సారి ఇలా మూడు పరిశ్రమల నుంచి హీరోలతో యాడ్ చేసి ఇండియా అంతా ప్రమోట్ చేస్తున్నారు.
కబడ్డీ.. మన మట్టిలో పుట్టిన ఆట
మన తెలుగువాడి పౌరుషాన్ని తెలిపే ఆట ✊కండల బలమే ఆయుధంగా ?
మైదానమే రణస్థలంగా ?
పోరాడే ఈ దమ్మున్న ఆటను అస్సలు మిస్ కావద్దు ?చూడండి
Pro Kabaddi League | Dec 2 | 8 PM నుండి
మీ #StarSportsTelugu & Disney + Hotstar లో#ProKabaddiLeague #PKLOnStar… pic.twitter.com/fd3diiws6k— Vamsi Kaka (@vamsikaka) November 21, 2023
