Nandu : గల్లీ క్రికెట్ నుంచి వరల్డ్ కప్ వరకు ప్రయాణం.. యాక్టర్ నందు ఎమోషనల్ పోస్ట్..

నందు ఇటీవల జరిగిన వరల్డ్ కప్(World Cup) మ్యాచ్ లకు కూడా తెలుగు హోస్ట్ గా సెలెక్ట్ అయి వరల్డ్ కప్ మ్యాచ్ లతో తెలుగు ప్రేక్షకులకి వినోదాన్ని పంచాడు.

Nandu : గల్లీ క్రికెట్ నుంచి వరల్డ్ కప్ వరకు ప్రయాణం.. యాక్టర్ నందు ఎమోషనల్ పోస్ట్..

Actor Nandu Emotional Post on Hosting for World Cup Matches

Updated On : November 21, 2023 / 10:03 AM IST

Nandu : తెలుగు నటుడు నందు అందరికి పరిచయమే. 2006లో ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నందు ఆ తర్వాత హీరోగా, సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. ఓ పక్క సినిమాల్లో మెప్పిస్తునే మరో పక్క క్రికెట్ హోస్ట్ గా మారాడు. గత కొన్నాళ్ల నుంచి ఇండియాలో జరిగే పలు క్రికెట్ మ్యాచ్ లకు హోస్ట్ గా, కామెంట్రీ చేస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తున్నాడు. IPL మ్యాచ్ ల నుంచి నేషనల్ మ్యాచ్ ల వరకు ఎదిగాడు.

ఈ నేపథ్యంలో నందు ఇటీవల జరిగిన వరల్డ్ కప్(World Cup) మ్యాచ్ లకు కూడా తెలుగు హోస్ట్ గా సెలెక్ట్ అయి వరల్డ్ కప్ మ్యాచ్ లతో తెలుగు ప్రేక్షకులకి వినోదాన్ని పంచాడు. పలువురు క్రికెటర్స్ ని ఇంటర్వ్యూ కూడా చేశాడు. వరల్డ్ కప్ ట్రోఫీతో ఫోటోలు కూడా దిగాడు నందు. తాజాగా వరల్డ్ కప్ ట్రోఫీతో, స్టార్ స్పోర్ట్స్ తెలుగు మైక్ తో స్టేడియంలో దిగిన ఫోటోలను నందు తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

నందు వరల్డ్ కప్ ట్రోఫీతో దిగిన ఫోటోలను షేర్ చేసి.. మా వీధిలో గల్లీ క్రికెట్ ఆడే దగ్గర్నుంచి క్రికెట్ వరల్డ్ కప్ లో స్పోర్ట్స్ ప్రజెంటర్ గా నా ప్రయాణం సాగడానికి ఎవరు ఏమన్నా సరే నన్ను నేను నమ్మాను. అందుకే ఇవాళ ఇక్కడ ఉన్నాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు స్టార్ స్పోర్ట్స్ తెలుగుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశాడు. దీంతో నందు షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారయింది.

Also Read : Chinna : సిద్దార్థ్ లేటెస్ట్ హిట్ సినిమా ‘చిన్నా’ ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు? ఏ ఓటీటీ?

ఇక వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.