Balakrishna
నట సింహం నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై భారీ సెలబ్రేషన్స్‌కు రంగం సిద్ధమవుతోంది…. ఇటు సినిమా పరిశ్రమతోపాటు రాజకీయ, సేవా రంగంల్లోనూ తనదైన ముద్ర వేసిన బాలయ్య…. తనతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరి కోసం మూడు ప్రత్యేక ఈవెంట్లకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. తన గోల్డెన్ జూబ్లీ ఇయర్‌లోనే కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీతోపాటు… తన సహచరులను సగౌరవంగా సత్కరించాలని కూడా చూస్తున్నారట… ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల భారీ కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
బాలయ్య సినీ ప్రయాణం ఆగస్టు 30తో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. బాలయ్య మొట్టమొదటి సినిమా తాతమ్మ కల 1974 ఆగస్టు 30న విడుదలైంది. ఇప్పుడు 109 NBK సినిమా చేస్తున్నారు. 50 ఏళ్లుగా నాన్‌స్టాప్‌గా హీరోగా తెలుగు చిత్రసీమపై తనదైన ముద్రవేశారు బాలకృష్ణ. అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
జూబ్లీ సెలబ్రేషన్స్
ఇక సినీ రంగంలో బాలకృష్ణ ప్రస్థానానికి గుర్తుగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో బాలయ్య గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాలయ్యతో కలిసి నటించిన స్టార్స్‌తోపాటు టెక్నికల్ టీమ్, ప్రొడ్యూసర్స్ సహా అందరినీ సన్మానించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా లెవల్లో బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, సాండిల్ వుడ్ నుంచి గెస్ట్‌లను ఆహ్వానిస్తున్నారు. కేవలం సినీ ఇండ్రిస్ట్రీ వరకు మాత్రమే ఈ ఈవెంట్‌ను పరిమితం చేసిన బాలయ్య… మిగిలిన వారి కోసం మరో రెండు కార్యక్రమాలను చేపట్టబోతున్నారట…
హైదరబాద్‌లో సినీ ఇండస్ట్రీ కోసం ఈవెంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తూనే… బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా ఉన్న బాలయ్య… సెప్టెంబర్ 6న అమరావతిలో మరో పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో సినీ ఇండస్ట్రీకి పరిమితం చేసి… అమరావతిలో పూర్తిగా పొలిటికల్ ఈవెంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దీనికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తోపాటు మొత్తం టి.డి.పి నాయకులు, కార్యకర్తలు హాజరు అవుతారని అంటున్నారు. ఇక రాయలసీమలో తన నియోజకవర్గమైన హిందూపురంలో తన కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఓపినింగ్ చెయ్యబోతున్నాడని తెలుస్తోంది.అయితే దీనికి ఇంకా డేట్ ఫిక్స్ చెయ్యలేదని తెలుస్తోంది.
Also Read: విశాఖ వైసీపీ విలవిల.. ఎక్కడా కనిపించని వైసీపీ నేతలు